డబ్బుల కోసం కొడుకు కిడ్నాప్‌ | Son Kidnapped for money | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం కొడుకు కిడ్నాప్‌

Published Sun, Mar 25 2018 2:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Son Kidnapped for money - Sakshi

నార్నూర్‌ (ఆసిఫాబాద్‌): మద్యానికి అలవాటుపడి, ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్న ఓ వ్యక్తి కిడ్నాపర్‌గా మారాడు. సొంత కొడుకునే కిడ్నాప్‌ చేసి తన తండ్రి నుంచే డబ్బులు రాబట్టాలనే పన్నాగం పన్నాడు. ఈ వ్యవ హారం బెడిసి కొట్టడంతో కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌ గ్రామ పంచాయతీ పరిధి సోనాపూర్‌కు చెందిన జాదవ్‌ పరమేశ్వర్, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. పరమేశ్వర్‌ తన తండ్రి కిషన్‌ నుంచి రూ.5 లక్షలు రాబట్టాలనే ఉద్దేశంతో సన్నిహితులతో కలసి కిడ్నాప్‌నకు పన్నాగం పన్నాడు.

కాగా, పరమేశ్వర్‌ తన రెండో కుమారుడు జాదవ్‌ ప్రతీక్‌నాయక్‌(6) శుక్రవారం రాత్రి 10 గంటల వరకు టీవీ చూసి తన నానమ్మ వద్ద పడుకున్నాడు. శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతం లో కిడ్నాప్‌నకు గురయ్యాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ హనోక్, ఎస్‌ఐ కృష్ణకుమార్‌ రంగంలోకి దిగారు. పరమేశ్వర్‌కు సంబంధించిన సొంతకారులోనే బాలుడిని అపహరించి జైనూర్‌ మండలం జెండాగూడ గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద కారును వదిలి.. బాలుడిని తీసుకెళ్లారు.

కారు తాళాలు ఇంట్లోనే ఉండటం.., స్విఫ్ట్‌కారుకు సెన్సార్‌ సిస్టం ఉండటంతో తాళాలు లేకుండా కారు నడపలేరని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో ఉన్న బాలుడు బయటకు ఎలా వచ్చాడు, తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. ఆదిలాబాద్‌ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంలతో తనిఖీ చేయించగా బాలుడి తండ్రి చుట్టూ తిరగడంతో అనుమానం మరింత బలపడింది. కుటుంబ సభ్యులందరినీ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు.  

జైనూర్‌లో ఆచూకీ లభ్యం
ప్రతీక్‌నాయక్‌ ఆచూకీ జైనూర్‌ మండలంలో లభ్యమైంది. అపహరించిన వారు పావునూర్‌ సమీపంలోని గుట్ట ప్రాంతంలో వదిలి వెళ్లారు. అడవిలో స్థానికులు గమనించి జైనూర్‌ పోలీసులకు అప్పగించారు. జైనూర్‌ సీఐ నాగేంద్ర స్థానిక సీఐ హనోక్‌కు సమాచారం అందించడంతో ఎస్‌ఐ కృష్ణకుమార్‌ వెళ్లి బాలుడిని తీసుకొచ్చి తల్లి సుజాతకు అప్పగించారు.

బాలుడిని సొంత కారులోనే జైనూర్‌ మండలం జెండాగూడ వైపు తీసుకెళ్లాడని తెలిపారు. గ్రామ సమీపంలో వంతెన వద్ద కారు కిందకు దిగిపోయిందన్నారు. అప్పటి ప్రణాళిక ప్రకారం ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి ఉన్నాడని, బాలుడు కారు దిగగానే ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడని పేర్కొన్నారు. పరమేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, సహకరించిన వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement