
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల కోసం కన్న తండ్రే తన ఆరేళ్ల కొడుకును కిడ్నాప్ చేసిన ఘటన అమరారెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. తాడేపల్లి అమరారెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు డబ్బుల కోసం తన స్నేహితులు శామ్యూల్, అబ్రహంతో కలిసి కొడుకు పార్థసారధి కిడ్నాప్‌కు పథకం రచించాడు. అనుకున్నట్లుగానే బుధవారం మాధ్యాహ్నం 2. 30 గంటలకు బాలుడిని స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భార్యకు ఫోన్ చేసి రూ. 5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment