తిరిగి వచ్చినవాడు | Human Beings Are Not Given Importance In Society | Sakshi
Sakshi News home page

తిరిగి వచ్చినవాడు

Published Mon, Dec 16 2019 12:41 AM | Last Updated on Mon, Dec 16 2019 12:41 AM

Human Beings Are Not Given Importance In Society - Sakshi

మనం కూడా ధనానికి ప్రాముఖ్యతనిస్తున్నామా? ఆలోచించుకోవాలి. వస్తు, సంపదలకు ఇచ్చే ప్రాముఖ్యం మనం మనుషులకు ఇవ్వడం లేదు. ఇక్కడ ఆ తండ్రి ఆస్తికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. కుమారుడు ప్రాణాలతో తిరిగి రావడమే చాలా గొప్ప అనే ఆ తండ్రి ప్రేమ ఈ రోజు మనకు అనేక పాఠాలు నేర్పుతుంది.  

ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని తనకు ఇవ్వమని తండ్రిని అడిగాడు. తండ్రికి ఆస్తిని పంచడం ఇష్టం లేకున్నా పంచాడు. అయితే చిన్నవాడు కావడం వల్ల ఆ ఆస్తిని ఎలా వాడాలో తెలియని ఆ కుమారుడు తనకున్న సంపదని తీసుకుని ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయి తన ఆస్తినంతటినీ చెడ్డ పనులు చేసి పోగొట్టుకున్నాడు. దాంతో చేసేదేం లేక ఆ దేశంలో పందులను మేపే పనిని చేస్తూ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటూ ఎంతో వేదననుభవించాడు. చాలా బాధ పడ్డాక ఆ కుమారుడికి తన తండ్రి, తన ఇల్లు అన్నీ గుర్తుకొచ్చాయి.

మళ్లీ తను అక్కడకు వెళితే బాగుంటుందనే ఆలోచన రావడంతోనే తిరిగి తన తండ్రి వద్దకు వెళ్లిపోయాడు. ఆ కుమారుడిని దూరం నుంచే చూసిన తండ్రి.. కుమారునికి ఎదురు వెళ్లి అతడిని ముద్దు పెట్టుకుని, తన దాసులతో కుమారుడు వచ్చాడని చెప్పి విందు చేయించాడు. అయితే ఆ తండ్రి వద్దనే ఉన్న పెద్ద కుమారుడికి తండ్రి చేస్తున్న ఆ పని నచ్చలేదు. ఆస్తి మొత్తాన్ని పోగొట్టి వచ్చిన వాడికోసం విందు చేసినందుకు అలిగాడు. అదే మాట తండ్రిని అడిగాడు. అందుకు ఆ తండ్రి ఇలా చెప్పాడు. (లూకా 15:32) ‘‘నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక మనం ఆనందించాలి’’ అన్నాడు. తన పెద్ద కుమారుడికి దేనిని ప్రేమించాలో నేర్పాడు.
 – బెల్లంకొండ రవికాంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement