► సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
► ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
బొమ్మనహళ్లి: ఆస్తి కోసం కన్న తండ్రి అని కూడా చూడకుండా బంధువులతో కలిసి తండ్రిని దారుణంగా కొట్టి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. బాగలకోటె జిల్లాలోని హుణగుంద తాలూకాలోని కోడివాళ గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 28 చోటు చేసుకున్న సంఘటనలో నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వివరాలు... కోడివాళ గ్రామానికి చెందిన మల్లప్ప హత్యకు గురైన వ్యక్తి. కాగా మల్లప్ప కుమారుడు దేవేంద్రప్ప, అతని బంధువులు కుమారుడికి భూమి రాసివ్వాలని మల్లప్పతో గొడవపడేవారు. వీరి బాధను భరించలేక మల్లప్ప భార్యతో కలిసి అద్దెకు ఓ ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నాడు. దీంతో ఎలాగైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని తన ఇద్దరు చిన్నాన్నలు మరో ఇద్దరు బంధువులతో కలిసి 2016 అక్టోబర్ 28న మల్లప్పను బంధువులు, కుమారుడు కట్టెలతో అతి దారుణంగా చితకాబాది హత్య చేశారు. అతను వేడుకుంటున్న కనికిరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు
Published Sat, Apr 1 2017 10:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement