భర్త మృతదేహంపై పడి బోరున విలపిస్తున్న భార్య
కూడేరు: కొర్రకోడు సర్పంచ్ జెన్నె లక్ష్మీనారాయణ (32) ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చె ందాడు. స్థానికులు, పోలీసులు అందించిన వివ రాల మేరకు... గ్రామానికి పంచాయతీ తరఫున తాగునీటిని సరఫరా చేసే బోరు మోటర్ పని చేయకపోవడంతో లక్ష్మీనారాయణ మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. విద్యుత్ తీగలను జత చేసే క్రమంలో ఒక విద్యుత్ తీగ జారి చేతికి తగలడంతో షాక్‌కు గురయ్యాడు. హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు వదిలాడు.
ఈయనకు భార్య మౌనిక, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నీవు మమ్మల్ని వదిలి పోతే ఇక మాకు దిక్కెవరంటూ భార్యా పిల్లలు మృతదేహంపై పడి బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, టీడీపీ నాయకులు మృ తుడి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment