surpanch
-
సీఎం కేసీఆర్‌కు రామచంద్రారెడ్డి రాజకీయ గురువు
దుబ్బాకటౌన్: తొలితరం కమ్యూనిస్టునేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సోలిపేట రామచంద్రారెడ్డిని 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు వరించాయి. మట్టిమనుషులతో కలిసి తిరిగిన జమీన్ లీడర్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రజల మేలు కోసం పరితపించే సిసలైన నాయకుడు. స్థానిక సంస్థల దగ్గరి నుంచి విదేశీ విధానాల వరకు ప్రత్యక్ష అవగాహన కలిగిన నేతగా పేరుంది. ఇప్పుడు గొప్పగా చెప్పకుంటున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నూతనచట్టాలపై కొన్ని దశాబ్దాల కిత్రమే రామచంద్రారెడ్డి ఎలుగెత్తి చాటిన విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. రామచంద్రారెడ్డి అనార్యోగంతో హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్‌తోపాటు, ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ● ఎమ్మెల్యేగా పనిచేసే కాలంలోనే రామచంద్రారెడ్డి దొమ్మాట నియోజకవర్గపరిధిలో వ్యవసాయం, రోడ్ల అభివృద్ధికి విశేష కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడవెల్లివాగుపై చెక్ డ్యాంలు నిర్మించేందుకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించారు. ● రామచంద్రారెడ్డి వాలీబాల్ ప్లేయర్. బాల్యంలో తోటి స్నేహితులతో కలిసి వాలీబాల్ బాగా ఆడేవారని చిట్టాపూర్వాసులు గుర్తుచేసుకుంటు న్నారు. ● పుస్తక పఠనం ఆయనకు ఎంతో ఇష్టం. వారంలో నాలుగు రోజులు లైబ్రరీలో గడిపేవారు. ఎనిమిదిపదుల వయస్సులోనూ రోజు నాలుౖ గెదు దినపత్రికలు చదివేవారు. సాహిత్య కార్య క్రమాలకు ఎవరు ఆహ్వానించినా తప్పకుండా వెళ్లేవారు. సొంతూరి నుంచే... దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మాలిపటేల్ సోలిపేట గాలిరెడ్డి– సుందరమ్మ దంపతులకు 1935లో రామచంద్రారెడ్డి జన్మించారు. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆపై సిద్దిపేటలో పదోతరగతి వరకు చదివారు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ సిటీకాలేజీలో చదివారు. ఈ సమయంలోనే 1951లో సిటీ కాలేజీకి స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అప్పుడే జరిగిన పరిణామాలతో అతడిలో కమ్యూనిజం బీజాలు మొలకెత్తాయి. దీంతో చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామానికి వచ్చాడు. ● చిట్టాపూర్ మొట్టమొదటిసర్పంచ్గా 1955లో ఎన్నికై 1964 వరకు అదే పదవిలో కొనసాగారు. ● 1964 నుంచి దుబ్బాక సమితి ప్రెసిడెంట్‌గా, 1970–72 వరకు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ● 1972లో దొమ్మాట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ● 1978 నుంచి మెదక్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. ● 1988 –89లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ● 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యు డిగా, రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, రాజ్య సభ అస్సూరెన్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ● ఉమ్మడి మెదక్‌కు కాంగ్రెస్, టీడీపీల తరఫున పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● ఇండియా –చైనా మిత్రమండలి అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ● సీఆర్ ఫౌండేషన్ తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టుతో ఇతర సంస్థలకు సభ్యుడిగా సేవలు అందించారు. ● లోక్‌సత్తాలో సైతం పనిచేసి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. ● గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ● మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో మొదలుకొని, మాజీ సీఎంలు చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. నక్సల్స్ ఇంటిని పేల్చడంతో కలత ప్రగతిశీల వామపక్ష భావాలతో ఉండే రామచంద్రారెడ్డి గ్రామంలోని దళితులు, వెనుకబడిన కులాల వారిని ఎంతగానో ప్రోత్సహించారు. గ్రామంలో సమానత్వం తీసుకొచ్చే సమయంలోనే నక్సలైట్ ఉద్యమం మొదలైంది. అప్పటికే జిల్లాలో చాలా నక్సలైట్ గ్రూపులు ఉండేవి. భూస్వాములు, రాజకీయ నేతలను టార్గెట్ చేసి వారి ఇళ్లు పేల్చేవారు. 1997లో రామచంద్రారెడ్డి పుట్టిపెరిగిన ఇంటిని నక్సలైట్లు పేల్చివేయడంతో తీవ్రంగా కలత చెందాడు. దీంతో కొంతకాలం ఆయన స్వగ్రామానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నక్సలైట్ల దాడిలో ఇంట్లోని విలువైన ఫొటోలు, పుస్తకాలు, చిన్నతనంలోని జ్ఞాపకాలు కాలి బూడిద అయ్యాయని చాలా బాధపడ్డారు. పేదలు, ఎస్సీలు కోసం తనకున్న 20 ఎకరాలకు పైగా భూమి ఇస్తే..నక్సల్స్ ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి అప్పుడు నక్సల్ వివరణ ఇస్తూ రామచంద్రారెడ్డి టీడీపీలో ఉన్నందునే ఇంటిని పేల్చామన్నారు. సినారెతో బంధుత్వం ప్రముఖకవి, రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డితో రామచంద్రారెడ్డికి దగ్గరి బంధుత్వం ఉంది. రామచంద్రారెడ్డి అమ్మమ్మ ఊరు మరిగడ్డ, సినారే స్వగ్రామం హన్మాజీపేట పక్కపక్క గ్రామాలే. ఇస్కస్ తదితర అభ్యుదయ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వీరిద్దరికి మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే 1986లో సినారే నాలుగో కుమార్తె కృష్ణవేణిని రామచందారెడ్డి పెద్ద కుమారుడు (రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల అసోషియేషన్ అధ్యక్షుడు) వెంకటేశ్వర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేయడంతో ఇద్దరు వియ్యం అందుకున్నారు.1996 నుంచి 2002 వరకు రామచంద్రారెడ్డి, సినారె ఒకే సమయంలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగడం మరో విశేషం. కేసీఆర్‌కు రాజకీయగురువు ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు రామచంద్రారెడ్డి రాజకీయ గురువు. సీఎం స్వగ్రామమైన చింతమడక దుబ్బాక సమితి పరిధిలోనే ఉండేది. సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి గెలుపొందినప్పటి నుంచి కేసీఆర్ తరచు కలిసేవారు. 1988లో టీడీపీ నాయకులకు రామచంద్రారెడ్డి నేతృత్వంలో రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి రామచంద్రారెడ్డి వరుసకు సోదరుడు అవుతాడు. రామలింగారెడ్డి, రామచంద్రారెడ్డిల తాతలు అన్నదమ్ముళ్లు. రామలింగారెడ్డి మృతి చెందినప్పుడు చిట్టాపూర్‌కు వచ్చి రామచంద్రారెడ్డి కంటతడి పెట్టారు. -
మహదేవుపల్లి సర్పంచ్ అనుమానాస్పద మృతి
కల్హేర్(నారాయణఖేడ్): అనుమానాస్పదంగా సర్పంచ్ మృతి చెందాడు. మహదేవుపల్లి సర్పంచ్ నాగధర పాపయ్య(60) అదే గ్రామానికి చెందిన నీరుడి సాయిరాం, మరికొందరితో కలిసి బాచేపల్లి డాబా హోటల్లో మద్యం తాగేందుకు వెళ్లారు. అక్కడి నుంచి పెద్దశంకరంపేట వైపు వెళ్లారు. కమలపూరం వద్ద ఆటో బోల్తాపడడంతో సర్పంచ్ పాపయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, నీరుడి సాయిరాం ఫోన్లో కుటుంబీకులకు సమాచారం చేరవేశాడు. ఈ క్రమంలో సర్పంచ్‌ను గిట్టనివారే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబీకులు, గ్రామస్తుల ఆందోళన.. బీఆర్ఎస్కి చెందిన సర్పంచ్ నాగధర పాపయ్యను సొంత పార్టీ నాయకులే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానితుడిగా భావిస్తున్న నీరుడి సాయిరాం ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచి మృతుడి కుటుంబీకులు ఆందోళన చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లి కుటుంబీకులను నచ్చజెప్పారు. సర్పంచ్ పాపయ మృతి పట్ల అనుమానం ఉంటే విచారణ అనంతరం నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబీకులు ఆందోళన విరమించారు. సర్పంచ్ మృతి బాధాకరం: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మహదేవుపల్లి సర్పంచ్ నాగధర పాపయ్య మృతి బాధాకరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న పాపయ్య మృతి పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు. -
సర్పంచ్, ఉపసర్పంచ్‌ల నిర్బంధం
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులోని సెజ్ భూములను అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ సోమవారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను గ్రామస్తులు నిర్బంధించారు. వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత కేంద్రం (సెజ్) లో రెండు కులసంఘాలకు స్థలాలు ఇచ్చేందుకు గాను భూములను పరిశీలించేందుకు సోమవారం తహసీల్దార్ అనిల్‌కుమార్‌తో పాటు సర్పంచ్ మూడ సుమలత వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు. గ్రామస్తులకు, పాలకవర్గ సిబ్బందికి తెలియకుండా సర్పంచ్ భర్త మూడ మహేందర్ భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చేశారు. అంతేగాకుండా పాలకవర్గానికి, గ్రామస్తులకు తెలియకుండా గ్రామపంచాయతీ తీర్మానం కాపీని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాంతం వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో తమ విలువైన భూములను సెజ్‌కు అప్పగించామని ఇప్పుడు తమకు తెలియకుండా భూములను అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మాట్లాడేందుకు గాను గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్న గ్రామ సర్పంచ్ మూడ సుమలత, ఉప సర్పంచ్ మాయాపురం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రమేష్, కారోబార్ కిషన్‌లను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం గదిలో నిర్బంధించి తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లక్కంపల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులు, యువకులతో మాట్లాడి వారిని శాంతిప జేసే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికురులు సమస్యను తేల్చేంత వరకు వీరిని వదిలి పెట్టేది లేదని పోలీసులతో గ్రామస్తులు, యువకులు వాగ్వివాదం చేశారు. ఆందోళన చేసిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
పల్లెపల్లెనా ప్రగతి వీచికలు
సుభాష్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పల్లెల ప్రగతిని ఆవిష్కరింపజేశాయి. ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్ వంటి హంగులతో పల్లెలన్నీ దశాబ్ది వేడుకకు వేదికలుగా నిలిచాయి. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమాలతో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. గ్రామ పంచాయతీలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వాటిని మామిడాకులు, పూల తోరణాలతో అలంకరించారు. గ్రామ పంచాయతీల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధర్పల్లిలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొనగా, సాటాపూర్‌లో బోధన్ ఎమ్మె ల్యే మహమ్మద్ షకీల్ ఆమిర్, నందిపేట్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు భాగస్వాములయ్యారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు సమకూరిన నిధులు, మెరుగుపడిన మౌలిక వసతులు, సాధించిన ప్రగతితోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వివిధ వర్గాల వారికి చేకూరిన లబ్ధి గురించి వక్తలు వివరించారు. పల్లెల పరిశుభ్రతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికుల సేవలను కొనియాడుతూ ‘సఫాయి అన్నా.. సలాం అన్న’ అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కార్మి కుల గౌరవాన్ని ఇనుమడింపజేశాయి. పల్లెల పరిశుభ్రత, ప్రగతి కోసం విశేషంగా కషి చేసిన మల్టీపర్పస్ వర్కర్ల సేవలకు గుర్తింపుగా వారిని ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. శానిటేషన్ విధులు నిర్వర్తిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్, పాదరక్షలు, గ్లౌజులు, నూనె, సబ్బులు వంటి వస్తువుల తో కూడిన జూట్ బ్యాగులను పంపిణీచేశారు. రాజధానికి తరలివెళ్లిన ఉత్తమ సర్పంచులు వివిధ అంశాల ప్రాతిపదికన జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికై న సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ నేతృత్వంలో గురువారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లా నుంచి మొత్తం 27 మంది సర్పంచులు, ఇద్దరు మల్టీ పర్పస్ వర్కర్లు ప్రత్యేక బస్సులో బయల్దేరి వెళ్లారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వీరిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావుల చేతుల మీదుగా సన్మానించారు. -
సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం.. రేవంత్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాల్లో నందిపేట సర్పంచ్ దంపతులు.. సాంబారు వాణి, తిరుపతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం బిల్లులు రాకపోవడంతో గ్రామంలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నానని, అప్పులు చేసి అభివృద్దివ చేశానని తిరుపతి వాపోయారు. ఇక, ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘ఊరి కోసం అప్పు చేసి అభివృద్ధి చేసిన పాపానికి నిజామాబాద్ జిల్లా, నందిపేట సర్పంచ్ దంపతులు కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చుని సర్పంచ్‌లకు ఒక్క రూపాయి బాకీలేమని సిగ్గు ఎగ్గులేకుండా ప్రకటించే బానిస మంత్రులు దీనికి ఏం సమాధానం చెబుతారు?’ అంటూ ప్రశ్నించారు. ఇదీ జరిగింది.. సాక్షి, నిజామాబాద్/సుభాష్‌నగర్ : ‘నాలుగేళ్లుగా సర్పంచ్‌గా కొనసాగుతున్నాను. బడుగు, బలహీనవర్గానికి చెందిన వాడిని. 20 ఏళ్లుగా సేవచేస్తూ సర్పంచ్‌గా గెలుపొందాను. అభివృద్ధి పనుల కోసం రూ. 2కోట్ల వరకు ఖర్చు చేశాను. చెక్కులపై ఉపసర్పంచ్ సంతకాలు పెట్టడంలేదు. బీఆర్ఎస్లో చేరితే బిల్లులు మంజూరవుతాయనే ఆశతో పార్టీ మారాను. వడ్డీ కలుపు కు ని రూ. 4కోట్ల వరకు అప్పులయ్యాయి. పలుమా ర్లు కలెక్టర్, డీపీవో దృష్టికి తీసుకొచ్చాను.. నందిపేట్ ప్రజలు క్షమించాలి. బిల్లులు రాక అభివృద్ధి పనులు చేయలేక మొహం చాటేస్తున్నాను. సిగ్గుతో తలదించుకుంటున్నాను’ అని రోదిస్తూ నందిపేట సర్పంచ్ దంపతులు సాంబారు వాణి, తిరుపతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు, జర్నలిస్టులు అగ్గిపెట్టె లాక్కున్నా రు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కాగా పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెతో కలెక్టరేట్‌లోకి రావడంతో భద్రతా సిబ్బంది కంగుతిన్నారు. కలెక్టర్ వచ్చే వరకూ కదిలేది లేదని భీషి్మంచారు. అక్క డి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాదించారు. డీపీవో వచ్చి వారిని సముదాయించారు. సర్పంచ్ దంపతులపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. అప్పుల పాలయ్యాం బిల్లులు రాకపోవడంతో గ్రామంలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నానని తిరుపతి వాపోయారు. అభివృద్ధి, సేవ చూసి విదేశాలు, అమెరికా నుంచి, ప్రముఖులు అవార్డులు అందజేశారని తెలిపారు. అప్పుల దిగులుతో తన భార్య వాణి ఆస్పత్రి పాలైందని, నేరుగా ఆస్పత్రి నుంచి ఇక్కడికి వచ్చామన్నారు. భార్యనే బతికించుకోలేని వాడిని, ఊరు ను ఏం ఉద్దరిస్తానని విలపించాడు. సర్పంచ్ వ్యవస్థను నాశనం చేశారు.. ఉప సర్పంచులకు చెక్‌పవర్ ఇచ్చి సర్పంచ్ వ్యవస్థను నాశనం చేశారని సర్పంచ్ భర్త తిరుపతి ఆరోపించారు. బీజేపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందిన నాటి నుంచి అనేక వేధింపులు ఎదుర్కొన్నానని, అట్రాసిటీ కేసుతో మూడేళ్లపాటు బాధను అను భవించానని రోదించారు. గ్రామ భూములు అమ్ముకున్నానని, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశానని సస్పెండ్ చేస్తే.. కోర్టుకెళ్లి మళ్లీ తెచ్చుకున్నా నని వివరించారు. వివిధ ఆరోపణలు చేస్తూ రెండున్నరేళ్ల పాటు చెక్‌పవర్ తొలగించారని, అయినా గ్రామాభివృద్ధికి నిధులు ఖర్చు చేశానని తెలిపారు. చివరకు పార్టీ మారినా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బిల్లులు, చెక్‌పవర్ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది మీకు తగునా.. కొన్ని సామాజికవర్గాలే కని్పస్తున్నాయా.. బడుగు, బలహీన వర్గాలు కని పించడం లేదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం: డీపీవో నందిపేట సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి ప్రజావాణిలో ఉపసర్పంచ్‌పై ఫిర్యాదుచేశారని డీపీవో జయసుధ తెలిపారు. చెక్కులపై సంతకాలు చేయడం లేదని, గ్రామాభివృద్ధికి సహకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టి, పంచాయతీరాజ్ యాక్ట్–2018 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డీపీవో వారికి హామీనిచ్చారు. కాగా సర్పంచ్‌గా ఉండి ఉపసర్పంచ్ కాళ్లు మొక్కే పరిస్థితి ఎదురైందని, ఈ ఉపసర్పంచ్ వద్దని చెప్పినా విని్పంచుకోలేదని వాపోయారు. ఒక డిజిటల్ టోకెన్(పెన్‌డ్రైవ్)తో సర్పంచ్‌గా పని చేయలేనని, తనకు వద్దని అధికారులకు ఇచ్చేశారు. -
సర్పంచ్‌గా ‘ఎంబీబీఎస్’ విద్యార్థిని.. ఎన్నికల్లో ఘన విజయం
ముంబై: యశోధరా షిండే.. 21 ఏళ్ల ఈ యువతి డాక్టర్ కావాలని కలలు కన్నది. అందుకు తగ్గట్లుగా జార్జియా వెళ్లి ఎంబీబీఎస్ చదువుతోంది. కానీ, ఆమెకు విధి మరో కొత్త రంగాన్ని అందించాలని తలపించింది. ఆమెను గ్రామానికి తిరిగి వచ్చేలా చేసింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచింది యశోధరా. భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించింది. చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై అందరి మన్ననలు పొందుతోంది. ఈ సంఘటన మహారాష్ట్ర, సంగ్లీ జిల్లాలోని మిరాజ్ తహసీల్ వడ్డి గ్రామంలో జరిగింది. యశోధరా సర్పంచ్‌గా పోటీ చేయాల్సి రావటంపై ఆమె మాటల్లోనే.. ‘జార్జియాలోని న్యూ విజన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాలుగో సంవత్సరంలో ఉన్నా. ఇంకా ఏడాదిన్నర కోర్సు మిగిలి ఉంది. మా గ్రామంలో ఎన్నికలు ప్రకటించిన క్రమంలో మా ఇంటి నుంచి ఎవరైనా పోటీ చేయాలని స్థానికులు కోరారు. సర్పంచ్‌గా నన్ను బరిలో నిలపాలని మా కుటుంబంతో పాటు అంతా నిర్ణయించారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పడంతో వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను.’ - యశోధరా షిండే, వడ్డి గ్రామ సర్పంచ్ తమ గ్రామం వడ్డి అభివృద్ధి కోసం పాటుపడతానని, మహిళలు స్వయంసమృద్ధిగా ఎదిగేందుకు, విద్యార్థుల కోసం ఈ లర్నింగ్, ఇతర మెరుగైన విద్యావిధాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొంది యశోధరా. రైతుల సంక్షేమంతో పాటు యువతకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని, అందుకు తగినట్లుగా వారు చదువుకుని స్వతంత్రంగా జీవించేందుకు కృషి చేస్తానని నొక్కి చెప్పారు యశోధరా. మరోవైపు.. తన ఎంబీబీఎస్ చదువును కొనసాగిస్తానని, ఆన్లైన్ విధానంలో పూర్తి చేస్తానని వెల్లడించింది. మహారాష్ట్రలోని 7,682 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 18న ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ ఫలితాలను గత మంగళవారం వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా -
పరువు హత్య: డ్రైవర్‌ను ప్రేమించిందని కూతురిని చంపేసిన సర్పంచ్!
పాట్నా: కింది స్థాయి వ్యక్తిని ప్రేమించిందనే కారణంగా సొంత కూతురినే చంపేశారు తల్లిదండ్రులు. యువకుడితో పాటు కూతురిని రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ అమానవీయ సంఘటన బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో కలకలం సృష్టించింది. యువకుడు వారి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, ఇరువురు ప్రేమించుకున్నారనే కోపంతోనే యువతి తల్లిదండ్రులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత యువకుడు లఖో పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజపుర్ దుమ్రీ ప్రాంతానికి చెందిన రామ్‌నును పాసవాన్(25), యువతి అయోధ్య బారీ గ్రామ సర్పంచ్ కూతురు రూపమ్ కుమారిగా గుర్తించారు. రైల్వే ట్రాక్‌పై డ్రైవర్‌తో పాటు యువతి మృతదేహం లభించటంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామ సర్పంచ్ అయిన యువతి తల్లి అనితా దేవి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. డ్రైవర్‌తో కూతురు ప్రేమలో పడటం ఇష్టంలేని అనితీ దేవీ ఈ హత్యలు చేసినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. యువకుడు చాలా కాలంగా సర్పంచ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ కారణంగానే వారి ప్రేమకు అడ్డు చెప్పారని తెలిపారు. ‘ట్రాక్టర్‌లోని ఇసుకను దించేందుకు సాయం చేయాలని డ్రైవర్‌కు సర్పంచ్ అనితా దేవీ సూచించగా.. వారి ఇంటికి వెళ్లాడు రామ్‌నును. ఈ క్రమంలోనే సర్పంచ్, ఆమె అనుచరులు దాడి చేసి హత్య చేశారు.’ అని మీడియాకు వెళ్లడించారు. మరోవైపు.. ఈ వాదనలను ముందుగా తోసిపుచ్చారు అనితా దేవీ. రామ్‌నును పాసవాన్‌తో కలిసి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బుకాయించే ప్రయత్నం చేశారు.‘చాలా కాలంగా మా ఇంట్లో పని చేస్తున్న డ్రైవర్‌తో నా కూతురు ప్రేమలో పడింది. ఆ విషయం తెలిసిన క్రమంలో అతడిని పనిలోంచి తీసేశాం. దీంతో వారు ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు.’అని సర్పంచ్ అనితా దేవీ పేర్కొన్నారు. అయితే, వారి ప్రేమను ఓర్వలేకనే సర్పంచ్ అనితా దేవీ హత్య చేశారని గ్రామస్థులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Crime: అడిగినంత డబ్బిస్తేనే.. నీ న్యూడ్ వీడియో డిలీట్ చేస్తా! -
దళిత యువకుడికి ఘోర అవమానం.. పరారీలో మాజీ సర్పంచ్!
లక్నో: ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. అందరి ముందు యువకుడిపై గ్రామ సర్పంచ్ చెప్పుతో దాడి చేసి, చంపేస్తామని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి నేపథ్యంలో భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దినేష్ కుమార్(27) అనే దళిత యువకుడిపై.. తాజ్పుర్ గ్రామ సర్పంచ్ శక్తి మోహన్ గుర్జార్, రేటా నగ్లా గ్రామ మాజీ సర్పంచ్ గాజే సింగ్‌లు దాడి చేశారు. చెప్పుతో కొడుతూ చంపేస్తామని యువకుడిని బెదిరించారు. వీడియోలు తీసి ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నగర ఎస్పీ అర్పిత్ విజయ్‌వర్గియా తెలిపారు. గ్రామ సర్పంచ్ శక్తి మోహన్‌ను అరెస్ట్ చేశామని, రెండో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. In UP's Muzaffarnagar, a village head and his people thrashed a SC youth with slippers in public and threatened him with death while abusing caste slurs. They also recorded the incident and made it viral to humiliate the SC people. pic.twitter.com/MeiPTfo9KF — Mission Ambedkar (@MissionAmbedkar) August 20, 2022 ఇదీ చదవండి: Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
మనోవేదనతో సర్పంచ్ ఆత్మహత్య
పూడూరు: మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సర్పంచ్ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. పూడూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) గత ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయితే, ఆయన మంగళవారం రాత్రి కుటంబీకులతో కలిసి భోజనం చేసి ఓ గదిలో నిద్రించాడు. బుధవారం తెల్లవారినా నిద్రలేవలేదు. పడుకొని ఉండొచ్చని భావించిన ఆయన తమ్ముడు శ్రీహరి పొలానికి వెళ్లాడు. (అక్కా.. నాకు బతకాలని లేదు!) గంట తర్వాత అతడు తిరిగి వచ్చినా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో గదికి వెనుక ఉన్న తలుపులను తీసి చూడగా ఆనందం దూలానికి ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కొంతకాలంగా తన సోదరుడికి ఆరోగ్యం సహకరించడం లేదని శ్రీహరి తెలిపారు. ఈక్రమంలో మానసికంగా వేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుఆనందం రాసిన ఓ సూసైట్ నోట్‌ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని అందులో సర్పంచ్ పేర్కొన్నాడు. వచ్చే నెలలోతనకు వివాహం నిశ్చయమైందని, అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. మృతుడి సోదరుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, సర్పంచ్ల సంతాపం.. కొత్తపల్లి సర్పంచ్ ఆనందం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మండలంలోని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆనందం మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
విషాదం : గ్రామ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని యాలాల మండలం తిమ్మాయిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామ సర్పంచ్ అపర్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అపర్ణ బుధవారం అర్థరాత్రి పురుగుల ముందు సేవించారు. దీనికి గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందారు. కాగా సర్పంచ్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అపర్ణ మృతిపట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
ఇరవై ఏళ్లుగా వారే సర్పంచ్‌లు
సాక్షి, మునుగోడు : ఒకప్పుడు ఇతర గ్రామపంచాయతీ పరిధిలో కచలాపురం గ్రామం 1994లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. ఆనాడు నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి ఆ గ్రామంలోని ప్రజలు అందరూ కలిసి సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలా గ్రామస్తులు అందరి ఆమోదంతో సర్పంచ్‌గా ఎన్నికైన ఆ వ్యక్తి వారికి అవసరమైన సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాడు. దీంతో పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ కుటుంబానికే ఆ గ్రామ ప్రజలు అండగా నిలుస్తున్నారు. అలా గత నాలుగు పర్యాయాలుగా ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తలు సర్పంచ్‌గా ఎన్నికవుతున్న ఆ గ్రామం పేరు కచలాపురం. ఆ గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ అయిన ఒక మారు తప్పా మిగిలిన ప్రతి ఎన్నికల్లో జనరల్ వస్తే భర్త, మహిళ వస్తే భార్య బరిలో నిలిచి సర్పంచ్ పదవిని పొందుతున్నారు. 1994లో జీపీగా ఏర్పాటు... మండలంలోని కచలాపురం గ్రామం 1994 వరకు సింగారం గ్రామ పంచాయతీలో కలసి ఉండేది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో 500లకు పైగా జనాభా కలిగిన కచలాపురం గ్రామాన్ని కూడా అధికారులు నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నూతన పంచాయతీగా ఏర్పాటైన మరుసటి ఏడాది 1995లో మొదటి ఎన్నికలు నిర్వహించగా సర్పంచ్ జనరల్ స్థానం రిజర్వ్ కాగా గ్రామస్తులు అందరూ కలిసి సీపీఐకి చెందిన గుర్జ రామచంద్రాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత తిరిగి 2001లో బీసీ మహిళ రిజర్వ్ కావడంతో అతడి భార్య గుర్జ అరుణని బరిలో నిలుపగా ఆమె గెలుపొందింది. ఆ పదవి కాలం ముగిసి 2006లో ఎన్నికలు రాగా అప్పుడు ఆ గ్రామం ఎస్సీ జనరల్ రిజర్వ్ కావడంతో రామచంద్రం బలపరిచిన సీపీఐ నాయకుడు పెద్దమామిడి వెంటకయ్యని బరిలో నిలిచి గెలుపొందాడు. ఆ తరువాత గత 2013లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో రామచంద్రం పోటీలో నిలిచి గెలుపొందాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో అతడి భార్య అరుణ పోటీచేసి గెలుపొందింది. ఇలా వరుసగా ఆయన కుటుంబాన్ని గ్రామస్తులు సర్పంచ్‌గా ఎన్నుకొంటూ అండగా నిలుస్తున్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇవి... రామచంద్రం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి నిత్యం గ్రామంలోని ప్రజలకు అవసరమైన సేవలతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఆయన 20 ఏళ్ల కాలంలో ఆ గ్రామంలోని ప్రజలకు అవసరమైన మంచి నీటి సరఫరాకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్‌తో పాటు వీధి, వీధికి మినీ ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం సహాయంతో దాదపు 160 కుటుంబాలకు ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయించారు. ప్రతి వీధిలో మురికి కాల్వల నిర్మాణం, నూతనంగా పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రానికి భవన నిర్మాణంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్ల నిర్మాణం చేయించారు. అంతే కాకుండా దళిత కాలనీలో ప్రతి వీధికి సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేయించాడు. పలు ఉత్తమ అవార్డులు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్‌లకు ప్రభుత్వం ఉత్తమ అవార్డులు అందిస్తుంది. అలా కచలాపురం గ్రామానికి కూడా నాలుగు పర్యాయాలు నాలుగు అవార్డులు దక్కాయి. మొదటిసారి 1999లో జిల్లా ఉత్తమ గ్రామ అవార్డు, 2004లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, 2007లో రాష్ట్రపతి అవార్డు, 2018లో ఉత్తమ స్వచ్ఛభారత్ అవార్డులు లభించాయి. సర్పంచ్‌గా పనిచేస్తున్న ఆ కుటుంబం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందునే ప్రతిసారి ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన ఇతర గ్రామాల ప్రజలు రామచంద్రం వల్లే తమ గ్రామాల్లోని సర్పంచ్‌లు పనిచేస్తే బాగుండని అంటున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ.. మా గ్రామ సర్పంచ్ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటారు. అందుకే ప్రజలు అందరూ ఆయననే సర్పంచ్‌గా కావాలని కోరుకుంటారు. గ్రామంలో ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా తన సమస్యగా భావించి దాని పరిష్కారానికి చొరవ చూపుతాడు. అదే విధంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటాడు. – ఎన్. వెంకట్‌రెడ్డి, గ్రామ యువకుడు సేవ చేయడంలో ఆనందం గ్రామ ప్రజలకు సేవ చేయడంలో చాలా ఆనందం ఉంటుంది. అందుకే ప్రజా ప్రతినిధిగా పనిచేయాలని ఉంటుంది. నేను చేసిన సేవకు ఫలితంగా మా గ్రామ ప్రజలు నాకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంటారు. వారి ఇష్టాలకు అనుగుణంగా గ్రామంలోని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తాను. నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. – గుర్జ రామచంద్రం, మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త -
‘భగువర్’ గ్రామం ప్రత్యేకత ఏంటో తెలుసా?
దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు. అందుకే మనదేశంలో మంచి పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తూ.. అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేసి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలెన్నో ఉన్నాయి. మరోపక్క వివిధ రకాల కారణాలతో అభివృద్ధికి నోచుకోని గ్రామాలూ ఉన్నాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా ఇప్పటికీ.. సర్పంచ్ లేకపోయినా.. ఓ గ్రామం ఒడిదుడికులన్నింటిని అధిగమిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా, కరేలి మండలంలో భగువర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాక సర్పంచ్ పదవికి ఎన్నిక జరగలేదు. గ్రామంలోని పెద్దను సామూహికంగా నిర్ణయించి, పెద్ద నిర్ణయాలతో ముందుకు సాగుతారు భగువర్ గ్రామ ప్రజలు. 1962లో గ్రామ పంచాయతీ భవనాన్నీ నిర్మించారు. అయితే ఈ భవనాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు వారంతా. సర్పంచ్ లేక పోయినా గ్రామస్వరాజ్యం సాధించడంలో భగువర్ గ్రామం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామం మొత్తం అభివృద్ధిని పరిశీలిస్తే... ఆదర్శ గ్రామాలైన.. రాలేగావ్ సిద్ధి, హివారే బజార్, గంగదేవిపల్లి గ్రామాల అభివృద్ధి కంటే కొన్ని వందల రెట్లు భగువర్ గ్రామం ముందంజలో ఉంది. మొదట్లో గ్రామానికి చెందిన నిర్ణయాలు ఆ గ్రామం లోని పెద్ద, మర్యాదస్తుడుగా అందరూ గౌరవించే ‘‘భయ్యాజీ’’ తీసుకునే వారు. భయ్యాజీ కష్టపడేతత్వం చూసిన గ్రామస్తులు ఆయన అడుగు జాడల్లో నడిచి గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. 2012 లో భయ్యాజీ మరణించినా, ఇప్పటికి ఆయన మార్గంలోనే గ్రామస్తులంతా నడుస్తున్నారు. అత్యుత్తమ నీటి వ్యవస్థ.. దేశంలోనే అత్యుత్తమ మురుగు నీటి వ్యవస్థ ఈ గ్రామంలో ఉంది. మురుగునీరు రోడ్లపై పారకుండా భూగర్భ కాలువ వ్యవస్థ ఉంది. వర్షపు నీరు, వృథాగా పోయే నీరు నిల్వ చేయడానికి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు తగినంత స్థాయిలో ఉన్నాయి. ఏ భేదం లేకుండా... గ్రామ పాఠశాలలో కుల, మతాలతో సంబంధం లేకుండా అందరు విద్యార్థులు కలిసి చదువుకుంటారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇటువంటి గ్రామాలు జిల్లాకో రెండు ఉన్నా.. దేశం అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకుపోతుంది. ఇంతటి గొప్ప అభివృద్ధి కలిగిన భగువర్ గ్రామంపై ‘‘స్వరాజ్ ముమ్కిన్ హై’’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తీశా>రు. ఈ డాక్యుమెంటరీకి అవార్డు కూడా లభించడం విశేషం. అత్యధిక గోబర్ గ్యాస్ ప్లాంట్లు... దేశంలోనే అత్యధిక గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉన్న గ్రామంగా భగువర్ రికార్డు సృష్టించింది. ఈ గ్రామ జనాభా 1700 లకు పైగా ఉంటుంది. సుమారు 400 ఇళ్లు ఉన్నాయి. గ్రామం మొత్తం మీద 51 గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి సాయంతోనే వంట గ్యాస్‌ను, వీధి లైట్లను వెలిగిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం భగువర్ గ్రామంలో నిషేధించారు. గ్రామంలో సేకరించిన చెత్తనంతా ఒకచోట పెద్ద గుంతలో వేసి ఎరువుగా తయారు చేస్తారు. ఈ ఎరువును ఏడాదికి ఒకసారి వేలం వేసి, వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. సొంతంగా రోడ్ల నిర్మాణం... భగువర్కు మొదట్లో సరైన రహదారి ఉండేదికాదు. గ్రామంలోని యువకులంతా కలిసి మూడు కిలో మీటర్ల మేర రోడ్డును స్వయంగా నిర్మించారు. అది గుర్తించిన ప్రభుత్వం తర్వాత సిమెంటు రోడ్డు నిర్మించింది. భగువర్లో 35 ట్రాక్టర్లు, 75 చెరుకు గడల ప్రాసెస్ మిషన్లు, అందరూ వాడుకునేందుకు 25 చేతి పంపులు ఉన్నాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ఏదైనా సమావేశాలు, పండగలు, ఫంక్షన్లు నిర్వహించినప్పుడు వాడుకోవడానికి జనరల్ టాయిలెట్స్ కూడా నిర్మించుకున్నారు. -
నాడు వలస జీవులు..నేడు పల్లె పాలకులు
తమకు జీవితాన్ని ఇచ్చిన పల్లె రుణం తీర్చుకోవాలనే ఆకాంక్షతో పలువురు ప్రవాసులు భారీ వేతనాలను సైతం వదులుకుని స్వగ్రామాలకు చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌లుగా ఎన్నికై ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పల్లెల్లో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పలువురు ప్రవాసులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అలాగే రెండో విడత, మూడో విడత పంచాయతీ బరిలోనూ మరి కొందరు పోటీలో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసి ఏటా రూ.కోట్లాది విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశానికి తెచ్చిపెట్టిన ప్రవాసులు ఇప్పుడు పల్లెలను పాలించే బాధ్యతలను స్వీకరిస్తున్నారు. –సాక్షి నెట్వర్క్ ఉన్నత ఉద్యోగం వదులుకుని.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకెట్‌కు చెందిన కడారి శ్రీనివాస్ దుబాయ్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించారు. కంపెనీలో పనిచేస్తూనే ఎన్ఆర్ఐ పాలసీ కోసం ఉద్యమించారు. స్వచ్చంద సంస్థల ప్రతినిధిగా యూఏఈలో కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవడంలో శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది. అయితే, తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే సంకల్పంతో నెలకు రూ.1.10లక్షల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని పంచాయతీ పోరులో నిలిచారు. 239 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దాదాపు 17 ఏళ్ల నుంచి దుబాయ్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ 2001లో తొలిసారి సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ గల్ఫ్‌కు వెళ్లి ఉద్యోగం చేశారు. ఈసారి తనను సర్పంచ్‌గా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని, సుంకెట్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని శ్రీనివాస్ చెబుతున్నారు. గల్ఫ్‌కు స్వస్తి.. ఊరితో దోస్తీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన బూర్గుల నందయ్య వ్యవసాయం కలిసిరాకపోవడంతో బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనికి కుదిరాడు. కాగా, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వెంకట్రావుపల్లి బీసీ జనరల్ కావడంతో నందయ్య దుబాయి నుంచి వచ్చి పోటీచేశారు. హోరాహోరీ పోటీ ఉన్నా.. నందయ్య విజయం సాధించారు. ఈయన 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీచేసి ఓడిపోయారు. మన దేశంలోనే బతకాలని గల్ఫ్ నుంచి వచ్చానని, ఊరుకి సేవ చేయాలని సర్పంచిగా ఎన్నికయ్యానని నందయ్య చెప్పారు. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సౌదీ నుంచి వచ్చి సర్పంచ్‌గా ఎన్నిక జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి 2007లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ కంపెనీలో స్థిరపడి ఆర్థికంగా ఎదిగారు. తన స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పేదవారికి తోచిన సహాయం చేశారు. దీంతో ఆయనకు మంచి పేరు ఉంది. అయితే, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మన్నెగూడెం జనరల్‌కు రిజర్వు అయింది. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో నరేశ్‌రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో గ్రామస్తులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం జీవితంలో మరిచిపోలేనని, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అంటున్నారు నరేష్‌రెడ్డి. -
వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్‌పై దాడి
అనంతపురం, శింగనమల: మండలంలో ఇరువెందలలో మళ్లీ గ్రామకక్షలు పడగవిప్పాయి. వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్, సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు గంగన్న, అతని అనుచరుడు చిన్న నారాయణపై టీడీపీ నాయకులు గొడ్డలితో దాడి చేశారు. బాధితులు, గ్రామస్తుల వివరాల మేరకు..వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ గంగన్న, టీడీపీ నేత పెద్దనారాయణస్వామి ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇద్దరికీ దారి విషయంలో వివాదం ఉంది. ఆరు నెలలుగా పోలీసులు పంచాయతీ చేస్తూనే ఉన్నా సమస్య తీరలేదు.గురువారం గంగన్న, అతని అనుచరుడు చిన్న నారాయణ నడుచుకుంటూ ఎస్సీ కాలనీ వైపు పోతుండగా పెద్దనారాయణస్వామి, వారి అనుచరులు గొడ్డలి, కట్టెలతో దాడి చేసేందుకు వచ్చారు. గంగన్న తప్పించుకోవడంతో చిన్న నారాయణపై దాడి చేశారు. ఈదాడిలో చిన్ననారాయణ తల, కాళ్లుకు బలమైన గాయాలు తగిలాయి. స్థానికులు వెంటనే అతడిని 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇటుకలపల్లి సీఐ పులయ్య, నార్పల ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విద్యుదాఘాతంతో సర్పంచ్ మృత్యువాత
కూడేరు: కొర్రకోడు సర్పంచ్ జెన్నె లక్ష్మీనారాయణ (32) ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చె ందాడు. స్థానికులు, పోలీసులు అందించిన వివ రాల మేరకు... గ్రామానికి పంచాయతీ తరఫున తాగునీటిని సరఫరా చేసే బోరు మోటర్ పని చేయకపోవడంతో లక్ష్మీనారాయణ మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. విద్యుత్ తీగలను జత చేసే క్రమంలో ఒక విద్యుత్ తీగ జారి చేతికి తగలడంతో షాక్‌కు గురయ్యాడు. హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు వదిలాడు. ఈయనకు భార్య మౌనిక, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నీవు మమ్మల్ని వదిలి పోతే ఇక మాకు దిక్కెవరంటూ భార్యా పిల్లలు మృతదేహంపై పడి బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు మృ తుడి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. -
మొదటి భార్య స్థానంలో రెండో భార్య
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మూసాపేట మండలం పోల్కంపల్లి సర్పంచ్ రేఖమ్మ పేరుపై భీమమ్మ కొనసాగుతున్నారని అదే గ్రామానికి చెందిన చెన్నయ్య పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను సమాచార హక్కు ద్వారా సేకరించినట్లు చెప్పారు. యాదయ్య మొదటి భార్య రేఖమ్మ పేరుపై రెండో భార్య సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న అంశంపై విచారణ చేపట్టాలని ఆర్డీఓ లక్ష్మీనారాయణకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోల్కంపల్లికి చెందిన యాదయ్య మొదటి భార్య రేణమ్మతో విడిపోయి గండీడ్ మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన భీమమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో 2013 పం చాయతీ ఎన్నికల్లో రేఖమ్మ పేరు మీద భీమమ్మ ఫొటో పెట్టి ఓటర్ గుర్తింపు కార్డు సృష్టించారు. దీని ద్వారా ఆమె పోల్కంపల్లి సర్పంచ్‌గా పోటీ చేయించగా గెలుపొందా రు. అప్పటి నుంచి రేఖమ్మ పేరుతో భీమమ్మ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం కా ర్యకర్త చెన్నయ్య.. నామినేషన్ పత్రాలు, స్క్రూటినీ వివ రాలు సేకరించగా నామినేషన్లో రేఖమ్మ పేరు ఉండగా, గెలిచింది భీమమ్మ అని తేలింది. ఈ విషయమై డీపీఓ మాట్లాడుతూ పోల్కంపల్లి సర్పంచ్ వ్యవహారంపై కలె క్టర్ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. -
పంచాయతీ సందడి!
పల్లెల్లో పంచాయతీ సందడి మొదలైంది. స్థానిక పోరుకు సర్కారు పచ్చజెండా ఊపడంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు.ప్రస్తుత పాలకవర్గం ఆగస్టులో ముగియనున్న నేపథ్యంలో అప్ప ట్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చెక్ పవర్ విషయంలో తీసుకొచ్చిన నిబంధనల నేపథ్యంలో నాయకులు చర్చోపచర్చలు జరుపుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సమరానికి తెరలేచింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదముద్ర పడడంతో గ్రా మ పంచాయతీల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. గడువులోపు ఎన్నికలు నిర్వహిస్తామని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఎన్నికలకు దాదాపుగా లైన్ క్లియరైనట్లయింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు రెండో తేదీ నాటికి ముగి యనుండడంతో అప్పటిలోపు ఎన్నికలు జరపాలని ప్రభు త్వం భావిస్తోంది. మే నెలాఖరులోగా ఎన్నికలను పూర్తి చేసి.. కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో జూన్ నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరే అవకాశముంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమా..? పరోక్షమా.. అనే చర్చకు ఫుల్స్టాప్ పడిన పరిస్థితుల్లో సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఆశావహులు తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు చెక్‌పవర్ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పల్లెల్లో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికే చెక్ పవర్ ఉండేది. ఇకపై కార్యదర్శి స్థానే ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయం స్థానిక సంస్థల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఉప సర్పంచ్‌దే హవా! రిజర్వేషన్ల కారణంగా గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ల ప్రాబల్యమే ఎక్కువగా కనిపించనుంది. నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలు సర్పంచ్ కుర్చీ ఎక్కితే.. బలమైన సామాజికవర్గం ఉప సర్పంచ్ పదవిని చేజిక్కించుకుంటోంది. వార్డు సభ్యుల సంఖ్యాబలంతో ఉప సర్పంచ్ సీటును దక్కించుకుంటున్న సభ్యులు పంచాయతీ పాలనావ్యవహారాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ల పాత్ర కూడా దాదాపుగా వీరే పోషిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ కూడా కట్టబెట్టడంతో గ్రామ రాజకీయాలు సరికొత్త పుంతను తొక్కనున్నాయి. ఇప్పటికే గ్రామ రాజకీయాల్లో పలుకుబడి ప్రదర్శిస్తున్న ఉపసర్పంచ్ పదవి.. వచ్చేఎన్నికల నుంచి మరింత పవర్‌ఫుల్‌గా మారనుంది. ఈ తరుణంలో ఉప సర్పంచ్ సీటును కైవసం చేసుకునేందుకు పోటీ తీవ్రం కానుంది. సర్పంచ్ అధికారాలకు తగ్గట్టు దాదాపు అవే హక్కులు ఉపసర్పంచ్ కూడా ఉండే అవకాశం ఉన్నందున ఈ పదవి దక్కించుకునే విషయంలో పల్లె రాజకీయం రసవత్తరంగా మారనుంది. మరోవైపు ఇప్పటి నుంచి పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం కూడా పంచాయతీ పోరులో కీలకం కానుంది. ప్రస్తుతం ఐదేళ్లకోసారి రిజర్వేషన్ మారేది. దీంతో ఒకసారి గెలిచిన ప్రజాప్రతినిధులు మరోసారి తన సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉండదనే భావనలో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపేవారు. అదే సమయంలో ఎలాగూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదనే ధీమాతో గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడడమేగాకుండా.. నిధులు దుర్వినియోగం కూడా గణనీయంగా ఉండేది. ఈ పరిస్థితిని విశ్లేషించిన సర్కారు.. పదేళ్లపాటు ఒకే విధమైన రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకసారి సర్పంచ్ గెలిచినా అభ్యర్థి మరోసారి తన అధిక్యతను ప్రదర్శించుకునేందుకు గ్రామాభివృద్ధిపై దృష్టిసారించే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్ల ప్రకటనపై ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే రిజర్వేషన్ వర్తింపజేసిన సామాజికవర్గం ఆశావహులు మాత్రం.. సర్పంచ్ పదవిపైగాకుండా ఉపసర్పంచ్ పదవిపై కన్నేశారు. ఇలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందే తడువు పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలకు ప్రీ పోల్స్‌గా భావించే ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల్లో బలమైన పునాది వేసుకోవాలని ఆయా రాజకీయపార్టీలు యోచిస్తున్నాయి. ఏదీఎమైనా.. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడమే తరువాయి.. బరిలో దిగేందుకు ఆశావహులు కదనకుతుహలంతో ఉన్నారు. -
సర్పంచే సుప్రీం!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పరిపాలన మొత్తం ఇకముందు సర్పంచ్ కేంద్రంగానే జరగనుంది. గ్రామ పంచాయతీ పరిధిలో కార్యనిర్వాహక నిర్ణయాలన్నీ సర్పంచ్ చేతుల్లోనే ఉండనున్నాయి. ప్రస్తుతం గ్రామ కార్యదర్శి నిర్వహిస్తున్న పలు కార్యనిర్వహణ అధికారాలను సర్పంచ్‌లకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ బిల్లు రూపకల్పన కోసం నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫారసుల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లుకు తుది రూపం ఇస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేటుకూ అవకాశం! గ్రామ సుపరిపాలన లక్ష్యంగా పంచాయతీరాజ్ చట్టానికి భారీగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నిధుల ఖర్చులో ప్రస్తుతం గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు సమానంగా అధికారాలు ఉన్నాయి. ఇద్దరూ సంతకాలు చేస్తేనే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇకముందు చెక్ పవర్ పూర్తిగా సర్పంచులకే దఖలు పడనుంది. ఇలా సర్పంచ్‌లకు అధికారాలు ఇవ్వడంతోపాటు సరిగా పనిచేయకపోతే వేటు వేసేలా బిల్లును రూపొందిస్తున్నారు. అవినీతి జరిగినట్లు నిరూపణ జరిగితే సర్పంచ్‌ను పూర్తిగా తొలగించేలా చట్టంలో సవరణలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన తండాలు, ఇతర ఆవాసాలను కొత్త పంచాయతీలుగా మార్చాలన్న నిర్ణయం మేరకు కొత్తగా 4,122 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. దీంతో పాత, కొత్త పంచాయతీలన్నింటికీ కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్త వాటికే కొత్త రిజర్వేషన్లు! కొత్త పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపైనా కీలక మార్పులను చేర్చనున్నారు. ప్రస్తుతమున్న పంచాయతీలకు ప్రస్తుత రిజర్వేషన్లనే వర్తింపజేయాలని, కొత్త గ్రామ పంచాయతీలకు మాత్రం కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా పదేళ్లకోసారి గ్రామ పంచాయతీల రిజర్వేషన్లలో మార్పులు ఉండేలా నిబంధనలు మార్చనున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్‌ను 33 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు. -
ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి
తాండూర్ : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని కాం గ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పరోక్ష పద్ధతికి వ్యతిరేకంగా మంగళవారం మండలంలోని కొత్తపల్లి, కిష్టంపేట, చౌటపల్లి, ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. కాలయాపన చేసేందుకే ప్రభుత్వం పరోక్ష పద్ధతి ఎంచుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్ ఈసా, సింగిల్ విండో వైఎస్ చైర్మన్ సూరం దామోదరరెడ్డి, ఇన్చార్జి సర్పంచ్ కాపర్తి సుభాష్, మాజీ సర్పంచ్‌లు పేరం శ్రీనివాస్, సుందిల్ల భూమయ్య, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్, రాంచందర్, తదితరులున్నారు. కాసిపేట మండలంలో... కాసిపేట : సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని డిమాండ్ చేస్తూ కాసిపేట మండలంలోనూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించి లబ్ధిపొందాలని చూస్తుందన్నారు. ఇలా చేస్తే రాష్ట్రంలో అలజడులు, పరస్పర దాడులు, డబ్బు, మద్యం, హత్యా రాజకీయాలు చోటుచేసుకుంటాయని అన్నారు. పరోక్ష ఎన్నికలు మానుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వేముల కృష్ణ, మల్లెత్తుల రాజేశం, గాదం గట్టయ్య, మైదం రమేశ్, మల్లేష్, చిలుకయ్య, రాజయ్య, శంకర్, ప్రదీప్, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కాసిపేట : మండలంలోని బుగ్గగూడలో మంగళవారం 60మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి యూత్ కాంగ్రెస్ నాయకుడు బండి ప్రభాకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. రత్నం ప్రదీప్, నాయకులు యశోద, గోనె శ్రీకాంత్, ప్రతాప్, మొండి, రాకేష్ తదితరులున్నారు. -
సర్పంచ్‌పై గిరిజనుల దాడి
తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలింపు మరో పది మందికి గాయాలు ధర్మపురి: భూముల విషయంలో గొడవలుపడి సర్పంచ్‌పై కర్రలతో దాడి చేసిన ఘటన సారంగాపూర్ మండలం చిన్నకొల్వాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ధర్మపురి మండలం ఆరెపల్లి సర్పంచ్‌తోపాటు మరో పది మంది గాయపడ్డారు. బాధితుడు సర్పంచ్ గడ రాజన్న తెలిపిన వివరాలు. సారంగపూర్ మండలంలోని కొల్వాయి, చిన్నకొల్వాయి, ధర్మపురి మండలంలోని ఆరెపెల్లికి చెందిన సర్వే నంబర్ 306లో 600 ఎకరాలకు పైగా ముంపు గ్రామాలకు చెందిన భూములు ఉన్నాయి. అందులో సర్పంచ్‌కు 4 ఎకరాలు, ఆరెపెల్లి గ్రామస్తులకు రెండు, మూడెకరాల చొప్పున భూములున్నాయి. గత నలభై ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్నారు. వాటికి భూమి శిస్తు సైతం చెల్లిస్తున్నారు. ఈ భూముల్లో తమకు హక్కుందంటూ చిన్నకొల్వాయికి చెందిన గిరిజనలు కొందరు దున్నారు. విషయం తెలిసిన ఆరెపెల్లికి చెందిన పట్టాలున్న రైతులు అక్కడికి చేరుకోగా గిరిజనులు కర్రలతో దాడి చేసి కళ్లల్లో కారంపొడి చల్లి పరారయ్యారు. సర్పంచ్ గడ రాజన్న, ఉపసర్పంచ్ గంగాధరి కిష్టయ్య, సాయిని గంగాధర్, బనికె ఎల్లయ్య, సంగెపు లక్ష్మి, నారాయణ, గంగాధర్ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్‌ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసికోవాలి : జెడ్పీటీసీ ఆరెపెల్లి సర్పంచ్‌తోపాటు పదిమందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసికోవాలని జెడ్పీటీసీ బాదినేని రాజమణి కోరారు. ఈ దాడిని జెడ్పీటీసీతో పాటు పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, మండల సర్పంచులు, నాయకులు ఖండించారు. -
‘పతాక’స్థాయిలో పొరపొచ్చాలు
జెండా ఆవిష్కరణపై జీవోతో గందరగోళం సర్పంచ్‌లు, ఎంపీటీసీల మధ్య విభేదాలు కొన్నిచోట్ల ఎగరని మువ్వన్నెల జెండా పార్వతీపురం రూరల్, బలిజిపేట రూరల్: విభేదాలతో పంద్రాగస్టు వేడుకలకు కళంకం తీసుకొచ్చారు. పతాకావిష్కరణ జగడంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని విస్మరించారు. మండలంలోని చాలా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో సోమవారం మువ్వన్నెల పతాకం రెపరెపలాడలేదు. ఈ ఏడాది సర్పంచ్‌లు కేవలం పంచాయతీ కార్యాలయాల్లోనే జెండా ఎగురవేయాలని, మండల పరిషత్ ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇది వారిమధ్య పొరపొచ్చాలకు కారణమైంది. చాలా గ్రామాల్లో ఎంపీటీసీలు జెండా ఎగరేసిన చోట సర్పంచ్‌లు, సర్పంచ్‌లు జెండా ఎగరేస్తే ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. చినబొండపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉదయం 11గంటల వరకు జెండా పండగ ఊసే లేదు. పూర్తిగా కార్యాలయం తలుపులు మూసివున్నాయి. ఇది తెలుసుకున్న ఎంపీడీవో కెల్ల కష్ణారావు వెంటనే సర్పంచ్ బోను దేవీచంద్రమౌళి, కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడి జెండా ఎగరేయాలని ఆదేశించడంతో ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు జెండాను పతాకావిష్కరణ అయిందనిపించారు. ఇలా పతాకావిష్కరణ జరగని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ప్రొటోకాల్‌కు మంగళం ప్రాథమిక పాఠశాలల వద్ద సర్పంచ్ల స్థానంలో ఎంపీటీసీలు పతాకావిష్కరణ చేసేందుకు అనుమతులు ఇచ్చినా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మంగళం పాడారు. బలిజిపేట మండలం పెద్దింపేట పంచాయతీ పరిధిలోని గౌరీపురం పాఠశాలలో పతాకావిష్కరణకు ఆహ్వానాలందుకున్న సర్పంచ్ కురిటి వెంకటినాయుడు, ఎంపీటీసీ టి.తవిటినాయుడు హాజరయ్యారు. కొత్త నిబందనల ప్రకారం ఎంపీటీసీతో పతాకావిష్కరణ చేయించాల్సి ఉంది. కానీ ప్రధానోపాధ్యాయుడు శంకరరావు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ముందు సర్పంచ్ వెంకటినాయుడిని ఆహ్వానించి పతాకావిష్కరణ చేయించి, అనంతరం ఎంపీటీసీని ఆహ్వానించారు. ప్రధానోపాధ్యాయుడు శంకరరావును వివరణ కోరగా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఇద్దరితో పతాకావిష్కరణ చేయించానని తెలిపారు. ఎంపీటీసీ తవిటినాయుడిని వివరణ కోరగా తనతో పతాకావిష్కరణ చేయించాల్సి ఉందన్నారు. కానీ ప్రధానోపాధ్యాయుడు ముందుగా సర్పంచ్ వెంకటినాయుడిని ఆహ్వానించి అనంతరం తనను ఆహ్వానించారని తెలిపారు. -
గ్రామ ప్రథమ పౌరుడికి...గౌరవభంగం!
ప్రోటోకాల్‌లో సర్పంచులకు సర్కారు మరో ఝలక్ జాతీయ పతాకావిష్కరణలో సంప్రదాయానికి గండి జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులకు పెద్దపీట జిల్లాలో గ్రూపులుగా అధికార పార్టీ నాయకులుl ‘ఆహ్వానం’ పంపడంలో ఎంఈవో, హెచ్ఎంలకు తలనొప్పి! స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ... ప్రజాప్రతినిధులంతా ఆ గౌరవం కోసం తహతహలాడుతుంటారు! జిల్లా కేంద్రం మినహా మిగతా ఎక్కడైనా ఆ గౌరవం ఇప్పటివరకూ గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కే సొంతం. తమ పరిధిలోని ఏ పాఠశాలలోనైనా స్వాతంత్య్ర దినోత్సవం నాడు వారే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఇప్పటి వరకూ వస్తోన్న సంప్రదాయం. దీన్ని ‘రాజకీయ కోణం’లో చూస్తూ టీడీపీ సర్కారు దానికి గండికొట్టింది. కొత్తగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను తెరపైకి తీసుకొచ్చింది. హైస్కూళ్లు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ వారికి అప్పగించింది. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో నియమించిన టీడీపీ కార్యకర్తల హల్చల్తో సర్పంచులు నిమిత్తమాత్రులయ్యారు. ఈ కొత్త సంప్రదాయం ఎంఈవోలు, ప్రధాన ఉపాధ్యాయులకు తలనొప్పి తీసుకొస్తోంది. జిల్లాలో అధికార పార్టీ నాయకులు గ్రామగ్రామాన గ్రూపు రాజకీయాలు పెంచిపోషిస్తుండటంతో ఎవ్వరిని ఆహ్వానిస్తే ఏం కొంప మునుగుతోందని మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో 470 ఉన్నత పాఠశాలలు, 567 ప్రాథమికోన్నత పాఠశాలలు, సుమారు 2,300 ప్రాథమిక పాఠశాలలున్నాయి. అలాగే జిల్లాలో 38 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఎనిమిది ఖాళీలు పోను 667 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. సర్పంచులు 1,099 మంది ఉన్నారు. అయితే ఇప్పటివరకూ అన్ని పాఠశాలల్లోనూ వాటి పరిధిలోని సర్పంచులే స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ చేసేవారు. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మంది సర్పంచులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులే గెలుపు సాధించారు. నాటి నుంచి వారి సర్పంచుల అధికారాలకు గండి కొట్టే ప్రయత్నాలు టీడీపీ ప్రభుత్వం మొదలెట్టింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు వంటి స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను ఒక్కొక్కటిగా దూరం చేస్తూ వచ్చింది. జన్మభూమి కమిటీలు ఆ కోణంలో వచ్చినవేనన్న విమర్శలు గురించి అందరికీ తెలిసిందే. నాటి గౌరవమేదీ? కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలకు సిఫారసు చేయాలన్నా, రేషన్ కార్డుల నుంచి బ్యాంకు రుణాల వరకూ, పింఛనుల నుంచి సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల జాబితాలు రూపొందించాలన్నా సర్పంచులదే కీలక పాత్ర. గ్రామంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచే అధ్యక్షత వహిండం.. లేదంటే ఆధ్వర్యం వహించాలి. కానీ ఆ గౌరవానికి గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తూనే వస్తోంది. జన్మభూమి కమిటీల సభ్యులకే సర్పంచుల అధికారాలన్నీ కట్టబెట్టేసింది. ఇప్పుడు పార్టీ గుర్తుపై గెలిచిన ప్రాదేశిక సభ్యులకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆహ్వానం’ పంపడానికి తర్జనభర్జన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి హైస్కూల్లోనూ జాతీయ పతాకావిష్కరణకు జెడ్పీటీసీ సభ్యుడునే ఆహ్వానించాలి. జనాభాను బట్టి ఒక్కో మండలంలో ఏడు నుంచి పది వరకూ హైస్కూళ్లు ఉన్నాయి. అంటే ఒక్కో జెడ్పీటీసీ సభుయడు ఏడు నుంచి పది చోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించాల్సి ఉంది. మండలం అంతా తిరిగి ఆయా హైస్కూళ్లలో పతాకాలను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి కార్యక్రమాలన్నీ ముగించేసరికి రోజంతా సరిపోద్ది. ఏదిఏమైనా జాతీయ పతాకాన్ని ఉదయం 11 గంటలలోపే ఆవిష్కరించాలి. కొన్ని పంచాయతీల్లో ఎంపీటీసీ సభ్యులు ఇద్దరు, కొన్నిచోట్ల ముగ్గురు కూడా ఉన్నారు. కానీ యూపీ స్కూల్ మాత్రమే ఒక్కటే ఉంది. అక్కడ ఎవ్వరిని ఆహ్వానించాలనే విషయంపై స్పష్టత లేదు. టీడీపీ గ్రూపులతో తలనొప్పి వేరయా... జిల్లాలో ప్రధానంగా మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లు వేర్వేరుగా గ్రూపులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా కూడా నాయకుల మధ్య గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో కార్యకర్తలే కాదు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులున్నారు. రాజాం నియోజకవర్గంలో కిమిడి కళా వెంకటరావు, మంత్రి అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్సీ ప్రతిభాభారతి మూడో గ్రూపు నిర్వహిస్తున్నారు. పాతపట్నంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో పాటు ఇటీవల పార్టీలోకి ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రూపుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గ్రూపు, మంత్రి అచ్చెన్నాయుడి గ్రూపు, ఎచ్చెర్లలో కళా వెంకటరావు గ్రూపు, మంత్రి అచ్చెన్నాయుడు గ్రూపుల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు ప్రతి నాయకుడు జాతీయ పతాకావిష్కరణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఒకే స్కూల్ పరిధిలో ఇద్దరు ముగ్గురు నాయకులున్నచోట ఎవ్వరిని ఆహ్వానించాలో తెలియక ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు తలలుపట్టుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబుది ఇదే తీరు... 2004 సంవత్సరానికి పూర్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి, సర్పంచుల హక్కులను కాలరాయడానికి చేయని ప్రయత్నం లేదు. వాటిని అడ్డుకోవడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. అందుకే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ 2014 ఎన్నికల సమయంలో మాత్రం తానెంతో మారానని ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చారు. ఆ మార్పు మంచి కోసం ఉండాలి. కానీ తిరోగమనంలో వెళ్తోంది. స్థానిక సంస్థలకు రాజ్యాగం నిర్దేశించిన విధివిధానాలు ఉన్నాయి. వాటిని ఇష్టానుసారం మార్చుకుంటూ పోవడం హాస్యాస్పదం. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్పంచులూ... హక్కుల కోసం గళమెత్తండి రాష్ట్రపతి తర్వాత చెక్‌పవర్ ఉన్న ఏకైక పదవి గ్రామ సర్పంచ్ ఒక్కటే. గ్రామానికి ప్రథమ పౌరులనే గౌరవం సర్పంచులదే. కేవలం టీడీపీ కార్యకర్తలతో నింపేసిన జన్మభూమి కమిటీలతో ప్రభుత్వం ఇప్పటికే వారినే అవమానించింది. ఇప్పటి వరకూ పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్‌లను కాదని, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆ గౌరవం కల్పించడం సమంజసం కాదు. అలాగని వీరిని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఎంతో కష్టతరమైన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌కు తగిన గౌరవం కల్పించాలనేదే డిమాండు. అలాంటి గౌరవానికి భంగం కలిగిస్తే సర్పంచులు ఎలా బుద్ధి చెబుతారో ప్రభుత్వానికి తర్వాత తెలిసివస్తుంది. తమ హక్కుల రక్షణకు సర్పంచులు ఇప్పటికైనా ప్రభుత్వానికి నిరసనగళం వినిపించాలి. – తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు -
సర్పంచ్ పదవుల వేలంపై ఈసీ ఆగ్రహం