
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మూసాపేట మండలం పోల్కంపల్లి సర్పంచ్ రేఖమ్మ పేరుపై భీమమ్మ కొనసాగుతున్నారని అదే గ్రామానికి చెందిన చెన్నయ్య పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను సమాచార హక్కు ద్వారా సేకరించినట్లు చెప్పారు. యాదయ్య మొదటి భార్య రేఖమ్మ పేరుపై రెండో భార్య సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న అంశంపై విచారణ చేపట్టాలని ఆర్డీఓ లక్ష్మీనారాయణకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోల్కంపల్లికి చెందిన యాదయ్య మొదటి భార్య రేణమ్మతో విడిపోయి గండీడ్ మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన భీమమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో 2013 పం చాయతీ ఎన్నికల్లో రేఖమ్మ పేరు మీద భీమమ్మ ఫొటో పెట్టి ఓటర్ గుర్తింపు కార్డు సృష్టించారు. దీని ద్వారా ఆమె పోల్కంపల్లి సర్పంచ్‌గా పోటీ చేయించగా గెలుపొందా రు. అప్పటి నుంచి రేఖమ్మ పేరుతో భీమమ్మ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.
దీనిపై సమాచార హక్కు చట్టం కా ర్యకర్త చెన్నయ్య.. నామినేషన్ పత్రాలు, స్క్రూటినీ వివ రాలు సేకరించగా నామినేషన్‌లో రేఖమ్మ పేరు ఉండగా, గెలిచింది భీమమ్మ అని తేలింది. ఈ విషయమై డీపీఓ మాట్లాడుతూ పోల్కంపల్లి సర్పంచ్ వ్యవహారంపై కలె క్టర్ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.