two wifes
-
ఇద్దరు భార్యల ముద్దుల యూట్యూబర్ : మెకానిక్‌గా మొదలై రూ. 200 కోట్లకు
నేటి ప్రపంచంలో కంటెంట్ క్రియేటర్లుగా సోషల్ మీడియా కూడా అతిపెద్ద ఆదాయవనరుగా మారిపోయింది. అంతేకాదు నాగ్‌పూర్ చాయ్‌వాలా ఢిల్లీ వడా పావ్ గర్ల్, హైదరాబాద్ కుమారాంటీ సోషల్ మీడియా ఈ వ్యక్తులకు సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలో మెకానిక్‌గా జీవితాన్ని మొదలు పెట్టి రూ. 200 కోట్లకు యజమానిగా మారిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.యూట్యూబర్ అర్మాన్ మాలిక్ 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో ఒకడిగా పాపులర్. ఇటీవలి ఇంటర్వ్యూలో, అర్మాన్ మాలిక్ తన జీవితంలోని వివిధ అంశాలను ప్రస్తావించాడు. వివాదాస్పద జీవితం, ఇద్దరు భార్యలు, వందల కోట్ల సంపద లాంటి వివరాలను షేర్ చేశాడు.అర్మాన్ మాలిక్ 8వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఇంటి నుంచి పారిపోయాడు. నాలుగు రోజులకే ఇంటికి తిరిగి వచ్చి, తనకు చదువు ఇష్టం లేదని, కార్లంటే ఇష్టమని వర్క్‌షాప్‌లో పని చేయాలని తండ్రికి చెప్పాడు.అలా మెకానిక్‌గా పనిచేయడమే కాకుండా, మాన్యువల్ వర్కర్ లాంటి అనేక ఇతర ఉద్యోగాలు కూడా చేశాడు.యూట్యూబర్ తన వ్లాగ్‌లతో విపరీతమైన ప్రజాదరణ పొందాడు.జేబులో ఒక్క పైసా కూడా లేకుండా వ్లాగింగ్ జర్నీ ప్రారంభించాడు. ఆసక్తికరమైన కంటెంట్‌తో, అర్మాన్ చాలా తొందర్లోనే అటు ప్రజాదరణను ఇటు ధనాన్ని సంపాదించాడు. , యూట్యూబర్ తన వద్ద రూ. రూ. 200 కోట్ల నికర విలువ. అదీ 2.5 సంవత్సరాలలో యూట్యూబ్ ద్వారా సంపాదించాడట.అర్మాన్ ముందు చూపుతొలుత టిక్‌టాకర్ ఉన్న అర్మాన్ నెలకు 2 లక్షలు సంపదించాడు. కోవిడ్-19 సమయంలో అర్మాన్ వద్ద కేవలం రూ. 35వేలు మాత్రమే. ఆ తరువాత యూట్యూబ్ ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చాడు. ఎవరీ అర్మాన్అర్మాన్ చిన్నపుడే తల్లి కేన్సర్‌తో పోరాడి మరణించింది. తండ్రి మద్యానికి బానిసకావడంతో అతను కూడా చాలా త్వరగా మరణించాడు. తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకునే సమయానికి అర్మాన్ వయసు కేవలం 19 ఏళ్లు. అర్మాన్‌కు ఒక అన్నయ్య, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. దీంతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. కేవలం 2 వేల రూపాయలతో హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరి బ్యాంకులో పని చేయడం ప్రారంభించాడు. అక్కడ పాయల్‌ను అనే అమ్మాయిని కలిశాడు. వీరిద్దరూ 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో ఈ దంపతులకు చిరయౌ అనే కుమారుడు జన్మించాడు.భార్య ఫ్రెండ్ కృతికతో ప్రేమ,పెళ్లిఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత, అర్మాన్ తన భార్య, పాయల్ బెస్ట్ ఫ్రెండ్ కృతికతో ప్రేమలో పడ్డాడు. కృతికను వివాహం చేసుకున్నాడు దీంతో పాయల్‌తో భర్తనుంచి విడిపోయింది. కానీ తరువాతి కాలంలో రాజీపడి ఇపుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దీంతో ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు అర్మాన్ మాలిక్. అర్మాన్ మాలిక్ భార్యలకు అనేకసార్లు గర్భస్రావాలు జరిగాయట. పాయల్, 2011లో ఒకసారి, మరోసారి గర్భస్రావం అయ్యింది. అలాగే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, ఆమె ఫెలోపియన్ ట్యూబ్లలో ఫెలోపియన్ ట్యూబ్‌ను తొలగించాల్సి వచ్చింది. చివరకు 2016లో కొడుకు చిరయు పుట్టాడు. 2023లో, పాయల్ ఐవీఎఫ్ ద్వారా అయాన్,తుబా కవలలకు జన్మనిచ్చింది. 2018లో అర్మాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కృతికకు గర్భస్రావాలు అయ్యాయి. చివరికి నాల్గోసారి జైద్ (మగబిడ్డ)కు జన్మనిచ్చింది.అర్మాన్ మాలిక్ 10 ప్లాట్లు, వాటి కథకుటుంబసభ్యులకు ప్రేమగా చూసుకున్న అర్మాన్ మాలిక్ తన సిబ్బందిని కూడా తన కుటుంబంలానే చూసుకుంటాడు. అతనికి మొత్తం 10 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో నాలుగు భార్యలు, నలుగురు పిల్లల కోసం కేటాయించగా, మిగిలిన ఆరు సిబ్బందికి కేటాయించాడట. ఇందులో ఒకటి పూర్తిగా స్టూడియోగా ఉపయోగిస్తాడు. -
భర్త అంత్యక్రియలు.. ఇద్దరు భార్యల మొండిపట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు భార్యలున్న భర్త బాధలు ఇన్నిన్ని కాదయా అంటారు.. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఏమోగానీ మరణించాక మాత్రం ఆ భర్తకు తిప్పలు తప్పలేదు. ఓ భార్య దహనం అంటే.. మరొకరు ఖననం అని మొండికేయడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన దక్షిణామూర్తి భార్య తంగమ్మాళ్. భార్య జీవించి ఉండగానే గౌరీ అలియాస్ ఏసుమేరీని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కంటే రెండో భార్య ఇంట్లోనే ఎక్కువకాలం గడిపే దక్షిణామూర్తి ఈ నెల 16న మృతి చెందాడు. అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయడమా.. లేక క్రైస్తవ సంప్రదాయం పద్ధతిలో ఖననం చేయడమా అనే ప్రశ్న తలెత్తింది. ‘చివరి దశలో ఆయన నా వద్దనే ఉన్నారు కాబట్టి ఖననం చేయాలి.. అంతేకాదు తన భర్త కూడా అదే ఆదేశించారు’ అని పేర్కొంటూ దక్షిణామూర్తి రాసినట్లుగా ఒక ఉత్తరాన్ని రెండో భార్య వెలుగులోకి తెచ్చింది. అయితే అందులో సంతకానికి బదులు వేలిముద్ర ఉంది. ‘ఆయనకు నేను మొదటి భార్యను.. మా సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరగాలి. సంతకం చేయడం తెలిసిన ఆయన వేలిముద్ర ఎందుకు వేస్తారు? రెండో భార్య చూపుతున్నది నకిలీ ఉత్తరం’ అంటూ పెద్ద భార్య వాదించింది. ఇద్దరు భార్యల మధ్య సామరస్యం కోసం పోలీసుల ప్రయత్నం కూడా విఫలమైంది. భార్యల కుమ్ములాట కొలిక్కిరాకపోగా దక్షిణామూర్తి శవం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లడంతో పోలీసులు చెంగల్పట్టు మార్చురీకి తరలించారు. భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యలూ కోర్టుకెక్కారు. ఇరుపక్షాల వాదనలు ముగిశాక న్యాయమూర్తి ప్రకాశ్ శుక్రవారం ఇరుపక్షాలనుద్దేశించి.. ‘దక్షిణామూర్తి అంత్యక్రియలపై ఇద్దరు భార్యలు ఏకాభిప్రాయానికి వస్తారని ఎంతో ఎదురుచూశాం.. అయితే ఇద్దరూ మొదటి నుంచి అదే పట్టులో ఉన్నారు.. రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రాకుంటే.. అనాథ శవంగా పరిగణించి ప్రభుత్వమే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది’ అంటూ తీర్పును వెలువరించారు. -
మొదటి భార్య స్థానంలో రెండో భార్య
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మూసాపేట మండలం పోల్కంపల్లి సర్పంచ్ రేఖమ్మ పేరుపై భీమమ్మ కొనసాగుతున్నారని అదే గ్రామానికి చెందిన చెన్నయ్య పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను సమాచార హక్కు ద్వారా సేకరించినట్లు చెప్పారు. యాదయ్య మొదటి భార్య రేఖమ్మ పేరుపై రెండో భార్య సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న అంశంపై విచారణ చేపట్టాలని ఆర్డీఓ లక్ష్మీనారాయణకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోల్కంపల్లికి చెందిన యాదయ్య మొదటి భార్య రేణమ్మతో విడిపోయి గండీడ్ మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన భీమమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో 2013 పం చాయతీ ఎన్నికల్లో రేఖమ్మ పేరు మీద భీమమ్మ ఫొటో పెట్టి ఓటర్ గుర్తింపు కార్డు సృష్టించారు. దీని ద్వారా ఆమె పోల్కంపల్లి సర్పంచ్‌గా పోటీ చేయించగా గెలుపొందా రు. అప్పటి నుంచి రేఖమ్మ పేరుతో భీమమ్మ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం కా ర్యకర్త చెన్నయ్య.. నామినేషన్ పత్రాలు, స్క్రూటినీ వివ రాలు సేకరించగా నామినేషన్లో రేఖమ్మ పేరు ఉండగా, గెలిచింది భీమమ్మ అని తేలింది. ఈ విషయమై డీపీఓ మాట్లాడుతూ పోల్కంపల్లి సర్పంచ్ వ్యవహారంపై కలె క్టర్ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. -
బాస మరచి.. తుది శ్వాస విడిచి
భీమవరం టౌన్ : ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన కొడుకు. దేశం కాని దేశంలో కష్టపడుతున్నాడని.. నాలుగురాళ్లు వెనుకేసుకుని అతడు సుఖంగా ఉంటే చాలనుకుంది ఓ తల్లి! ముద్దులొలికే ఇద్దరు మగ పిల్లలు. వారి భవిష్యత్తు కోసం తన భర్త దూర దేశంలో కష్ట పడుతున్నా త్వరలోనే అప్పులు తీర్చి కుటుంబం చీకూచింతా లేకుండా ఆనందంగా బతకొచ్చని అనుకుంది ఓ భార్య !. వారి ఆశలకు, ఊహలకు భిన్నంగా.. పరాయి దేశం వెళ్లి సంపాదిస్తున్న ఆ వ్యక్తి తిరిగి మరొక యువతి, ఆరునెలల పాపతో తిరిగొచ్చాడు. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుని రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చాడు. వివరాలలోకి వెళితే.. రామపూడి యేషయ్య(28)ది ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామం. తండ్రి చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లి ఉన్నంతలోనే కష్టపడి పెంచింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన తరువాత యేషయ్యకు పెళ్లి చేసింది. భార్య సుధారాణి, ఇద్దరు మగపిల్లలతో కుటుంబాన్ని కష్టపడి పోషించేవాడు. పెద్ద కుమారుడికి 7 ఏళ్లు, చిన్న కుమారుడికి 4 ఏళ్లు. పిల్లలను బాగా చదివించాలి, కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో యేషయ్య తన భార్య, పిల్లలను కాళ్ల మండలం దొడ్డనపూడిలోని అత్తింటికి పంపి.. తల్లిని స్వగ్రామంలోనే ఉంటున్న సోదరికి అప్పగించి 2015లో కువైట్ వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా సమీపంలో ఉంటున్న కృష్ణా జిల్లా లక్ష్మీపురం సమీపంలోని పల్లెపాలెం గ్రామానికి చెందిన సముద్రమ్మ అనే యువతితో పరిచయమైంది. ఇరువురు ఆ దేశంలో సహజీవనం చేశారు. ఫలితంగా ఇప్పుడు వారికి 6 నెలల పాప. ఈనెల 6వ తేదీన యేషయ్య సముద్రమ్మ, పాపతో స్వదేశానికి వచ్చాడు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వీళ్లతో ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు. 17వ తేదీ అర్ధరాత్రి యేషయ్య వంటగదిలోని పదునైన చాకుతో గుండెల్లో పొడుచుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనకు సంబంధించి టూటౌన్ ఎస్సై జి.కాళీచరణ్ బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యేషయ్య ఇక్కడికి వచ్చిన తరువాత కాళ్ల గ్రామం వెళ్లి భార్య సుధారాణిని కలిశాడు. అప్పులు తీరాక వస్తానని చెప్పి వెనుకకు వచ్చేశాడు. రాయలం గ్రామం వెళ్లి సముద్రమ్మతో ఘర్షణ పడ్డాడు. డబ్బులు ఎక్కువ ఖర్చుపెడుతున్నావంటూ ఆమెతో గొడవపడి మనస్తాపం చెంది చాకుతో గుండెల్లో పొడుచుకున్నాడు. 108 వాహనానికి సమాచారం అందడంతో వచ్చేసరికే యేషయ్య మృతిచెందాడు. భార్య సుధారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జీవితంలో చేసిన చిన్న పొరపాటు రెండు కుటుంబాలను విషాదంలోనికి నెట్టింది. పిల్లలు తండ్రిలేని వారయ్యారు. -
ఇద్దరు భార్యలున్నా మరో యువతితో..
ప్రేమ వ్యవహారం = కారు డ్రైవర్‌ను చితకబాదిన ప్రియురాలి బంధువులు బెంగళూరు(బనశంకరి) : ఇద్దరు భార్యలున్నా మరో యువతిని ప్రేమలోకి దించిన కారు డ్రైవర్‌ను ప్రియురాలి బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కగ్గలిపురకు చెందిన వజ్రేశ్ కారుడ్రైవరుగా పనిచేస్తున్నాడు. దొడ్డబళ్లాపుర తాలూకాకు చెందిన శశికళా అనే యువతిని వివాహం చేసుకుని రాజరాజేశ్వరినగరలో నివాసముంటున్నారు. అనంతరం మొదటి భార్యకు తెలియకుండా హొసకోటే తాలూకాకు చెందిన రూపా అనే యువతిని వివాహం చేసుకుని జ్ఞానభారతిపోలీస్స్టేషన్ పరిధిలోని బీడీఏ కాంప్లెక్స్ సమీపంలో అద్దె ఇంటిలో ఉంచాడు. ఇటీవల కగ్గలిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. తనను పెళ్లిచేసుకోవాలని కోరడంతో కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. రెండు చోట్ల కాపురాలు చేయడంతో ఖర్చు అధికమైన వజ్రేశ్ శశికళాను రూపా వద్దకు తీసుకెళ్లగా రెండు వివాహాలు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మరో యువతిని కూడా ప్రేమించినట్లు తెలియడంతో రూపా, శశికళలు శుక్రవారం ఉదయం వజ్రేశ్తో గొడవ పడ్డారు. విషయం ప్రేయసికి తెలియడంతో ఆమె తరఫు బంధువులు అక్కడకు చేరుకొని వజ్రేశ్ను చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వజ్రేశ్ ను అదుపులోకి విచారణ చేపట్టారు.