నేటి ప్రపంచంలో కంటెంట్ క్రియేటర్లుగా సోషల్ మీడియా కూడా అతిపెద్ద ఆదాయవనరుగా మారిపోయింది. అంతేకాదు నాగ్‌పూర్ చాయ్‌వాలా ఢిల్లీ వడా పావ్ గర్ల్, హైదరాబాద్ కుమారాంటీ సోషల్ మీడియా ఈ వ్యక్తులకు సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలో మెకానిక్‌గా జీవితాన్ని మొదలు పెట్టి రూ. 200 కోట్లకు యజమానిగా మారిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
యూట్యూబర్ అర్మాన్ మాలిక్ 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో ఒకడిగా పాపులర్. ఇటీవలి ఇంటర్వ్యూలో, అర్మాన్ మాలిక్ తన జీవితంలోని వివిధ అంశాలను ప్రస్తావించాడు. వివాదాస్పద జీవితం, ఇద్దరు భార్యలు, వందల కోట్ల సంపద లాంటి వివరాలను షేర్ చేశాడు.
అర్మాన్ మాలిక్ 8వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఇంటి నుంచి పారిపోయాడు. నాలుగు రోజులకే ఇంటికి తిరిగి వచ్చి, తనకు చదువు ఇష్టం లేదని, కార్లంటే ఇష్టమని వర్క్‌షాప్‌లో పని చేయాలని తండ్రికి చెప్పాడు.అలా మెకానిక్‌గా పనిచేయడమే కాకుండా, మాన్యువల్ వర్కర్ లాంటి అనేక ఇతర ఉద్యోగాలు కూడా చేశాడు.యూట్యూబర్ తన వ్లాగ్‌లతో విపరీతమైన ప్రజాదరణ పొందాడు.
జేబులో ఒక్క పైసా కూడా లేకుండా వ్లాగింగ్ జర్నీ ప్రారంభించాడు. ఆసక్తికరమైన కంటెంట్‌తో, అర్మాన్ చాలా తొందర్లోనే అటు ప్రజాదరణను ఇటు ధనాన్ని సంపాదించాడు. , యూట్యూబర్ తన వద్ద రూ. రూ. 200 కోట్ల నికర విలువ. అదీ 2.5 సంవత్సరాలలో యూట్యూబ్ ద్వారా సంపాదించాడట.
అర్మాన్ ముందు చూపు
తొలుత టిక్‌టాకర్ ఉన్న అర్మాన్ నెలకు 2 లక్షలు సంపదించాడు. కోవిడ్-19 సమయంలో అర్మాన్ వద్ద కేవలం రూ. 35వేలు మాత్రమే. ఆ తరువాత యూట్యూబ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చాడు.
ఎవరీ అర్మాన్
అర్మాన్ చిన్నపుడే తల్లి కేన్సర్‌తో పోరాడి మరణించింది. తండ్రి మద్యానికి బానిసకావడంతో అతను కూడా చాలా త్వరగా మరణించాడు. తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకునే సమయానికి అర్మాన్ వయసు కేవలం 19 ఏళ్లు. అర్మాన్‌కు ఒక అన్నయ్య, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. దీంతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. కేవలం 2 వేల రూపాయలతో హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరి బ్యాంకులో పని చేయడం ప్రారంభించాడు. అక్కడ పాయల్‌ను అనే అమ్మాయిని కలిశాడు. వీరిద్దరూ 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో ఈ దంపతులకు చిరయౌ అనే కుమారుడు జన్మించాడు.
భార్య ఫ్రెండ్ కృతికతో ప్రేమ,పెళ్లి
ఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత, అర్మాన్ తన భార్య, పాయల్ బెస్ట్ ఫ్రెండ్ కృతికతో ప్రేమలో పడ్డాడు. కృతికను వివాహం చేసుకున్నాడు దీంతో పాయల్‌తో భర్తనుంచి విడిపోయింది. కానీ తరువాతి కాలంలో రాజీపడి ఇపుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దీంతో ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు అర్మాన్ మాలిక్.
అర్మాన్ మాలిక్ భార్యలకు అనేకసార్లు గర్భస్రావాలు జరిగాయట. పాయల్, 2011లో ఒకసారి, మరోసారి గర్భస్రావం అయ్యింది. అలాగే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, ఆమె ఫెలోపియన్ ట్యూబ్‌లలో ఫెలోపియన్ ట్యూబ్‌ను తొలగించాల్సి వచ్చింది. చివరకు 2016లో కొడుకు చిరయు పుట్టాడు. 2023లో, పాయల్ ఐవీఎఫ్ ద్వారా అయాన్,తుబా కవలలకు జన్మనిచ్చింది. 2018లో అర్మాన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కృతికకు గర్భస్రావాలు అయ్యాయి. చివరికి నాల్గోసారి జైద్ (మగబిడ్డ)కు జన్మనిచ్చింది.
అర్మాన్ మాలిక్ 10 ప్లాట్లు, వాటి కథ
కుటుంబసభ్యులకు ప్రేమగా చూసుకున్న అర్మాన్ మాలిక్ తన సిబ్బందిని కూడా తన కుటుంబంలానే చూసుకుంటాడు. అతనికి మొత్తం 10 ఫ్లాట్‌లు ఉన్నాయి. వాటిలో నాలుగు భార్యలు, నలుగురు పిల్లల కోసం కేటాయించగా, మిగిలిన ఆరు సిబ్బందికి కేటాయించాడట. ఇందులో ఒకటి పూర్తిగా స్టూడియోగా ఉపయోగిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment