తాండూర్: కారోబార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నాయకలు
తాండూర్ : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని కాం గ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పరోక్ష పద్ధతికి వ్యతిరేకంగా మంగళవారం మండలంలోని కొత్తపల్లి, కిష్టంపేట, చౌటపల్లి, ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. కాలయాపన చేసేందుకే ప్రభుత్వం పరోక్ష పద్ధతి ఎంచుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్ ఈసా, సింగిల్ విండో వైఎస్ చైర్మన్ సూరం దామోదరరెడ్డి, ఇన్‌చార్జి సర్పంచ్ కాపర్తి సుభాష్, మాజీ సర్పంచ్‌లు పేరం శ్రీనివాస్, సుందిల్ల భూమయ్య, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్, రాంచందర్, తదితరులున్నారు.
కాసిపేట మండలంలో...
కాసిపేట : సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని డిమాండ్ చేస్తూ కాసిపేట మండలంలోనూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించి లబ్ధిపొందాలని చూస్తుందన్నారు. ఇలా చేస్తే రాష్ట్రంలో అలజడులు, పరస్పర దాడులు, డబ్బు, మద్యం, హత్యా రాజకీయాలు చోటుచేసుకుంటాయని అన్నారు. పరోక్ష ఎన్నికలు మానుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వేముల కృష్ణ, మల్లెత్తుల రాజేశం, గాదం గట్టయ్య, మైదం రమేశ్, మల్లేష్, చిలుకయ్య, రాజయ్య, శంకర్, ప్రదీప్, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
కాసిపేట : మండలంలోని బుగ్గగూడలో మంగళవారం 60మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి యూత్ కాంగ్రెస్ నాయకుడు బండి ప్రభాకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. రత్నం ప్రదీప్, నాయకులు యశోద, గోనె శ్రీకాంత్, ప్రతాప్, మొండి, రాకేష్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment