మృతదేహం వద్ద రోదిస్తున్న సర్పంచ్ కుటుంబీకులు
కల్హేర్(నారాయణఖేడ్): అనుమానాస్పదంగా సర్పంచ్ మృతి చెందాడు. మహదేవుపల్లి సర్పంచ్ నాగధర పాపయ్య(60) అదే గ్రామానికి చెందిన నీరుడి సాయిరాం, మరికొందరితో కలిసి బాచేపల్లి డాబా హోటల్‌లో మద్యం తాగేందుకు వెళ్లారు. అక్కడి నుంచి పెద్దశంకరంపేట వైపు వెళ్లారు. కమలపూరం వద్ద ఆటో బోల్తాపడడంతో సర్పంచ్ పాపయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, నీరుడి సాయిరాం ఫోన్‌లో కుటుంబీకులకు సమాచారం చేరవేశాడు. ఈ క్రమంలో సర్పంచ్‌ను గిట్టనివారే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.
కుటుంబీకులు, గ్రామస్తుల ఆందోళన..
బీఆర్‌ఎస్‌కి చెందిన సర్పంచ్ నాగధర పాపయ్యను సొంత పార్టీ నాయకులే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానితుడిగా భావిస్తున్న నీరుడి సాయిరాం ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచి మృతుడి కుటుంబీకులు ఆందోళన చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లి కుటుంబీకులను నచ్చజెప్పారు. సర్పంచ్ పాపయ మృతి పట్ల అనుమానం ఉంటే విచారణ అనంతరం నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబీకులు ఆందోళన విరమించారు.
సర్పంచ్ మృతి బాధాకరం: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
మహదేవుపల్లి సర్పంచ్ నాగధర పాపయ్య మృతి బాధాకరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న పాపయ్య మృతి పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment