కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు అడ్డుగా వచ్చిన అడివి పందిని కారు ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు దులపల్లి చంద్రశేఖర్(26), ఫణీందర్(27), చెన్నకేశవులు, బాల మల్లేశ్, కిషోర్‌కుమార్ కారులో షిర్డీకి బయల్దేరారు.
బాచేపల్లి సమీపంలో అడవి పంది రోడ్డుకు అడ్డు రావడంతో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో కారు పల్టీలు కొట్టి బోల్తా పడటంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, దులపల్లి చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురిని చికిత్స నిమిత్తం స్థానికులు 108 అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఫణీందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కల్హేర్ ఎస్‌ఐ వెంకటేశం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment