సర్పంచ్‌పై గిరిజనుల దాడి
భూముల విషయంలో గొడవలుపడి సర్పంచ్‌పై కర్రలతో దాడి చేసిన ఘటన సారంగాపూర్ మండలం చిన్నకొల్వాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ధర్మపురి మండలం ఆరెపల్లి సర్పంచ్‌తోపాటు మరో పది మంది గాయపడ్డారు.
-
తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలింపు
-
మరో పది మందికి గాయాలు
ధర్మపురి: భూముల విషయంలో గొడవలుపడి సర్పంచ్‌పై కర్రలతో దాడి చేసిన ఘటన సారంగాపూర్ మండలం చిన్నకొల్వాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ధర్మపురి మండలం ఆరెపల్లి సర్పంచ్‌తోపాటు మరో పది మంది గాయపడ్డారు. బాధితుడు సర్పంచ్ గడ రాజన్న తెలిపిన వివరాలు. సారంగపూర్ మండలంలోని కొల్వాయి, చిన్నకొల్వాయి, ధర్మపురి మండలంలోని ఆరెపెల్లికి చెందిన సర్వే నంబర్ 306లో 600 ఎకరాలకు పైగా ముంపు గ్రామాలకు చెందిన భూములు ఉన్నాయి. అందులో సర్పంచ్‌కు 4 ఎకరాలు, ఆరెపెల్లి గ్రామస్తులకు రెండు, మూడెకరాల చొప్పున భూములున్నాయి. గత నలభై ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్నారు. వాటికి భూమి శిస్తు సైతం చెల్లిస్తున్నారు. ఈ భూముల్లో తమకు హక్కుందంటూ చిన్నకొల్వాయికి చెందిన గిరిజనలు కొందరు దున్నారు. విషయం తెలిసిన ఆరెపెల్లికి చెందిన పట్టాలున్న రైతులు అక్కడికి చేరుకోగా గిరిజనులు కర్రలతో దాడి చేసి కళ్లల్లో కారంపొడి చల్లి పరారయ్యారు. సర్పంచ్ గడ రాజన్న, ఉపసర్పంచ్ గంగాధరి కిష్టయ్య, సాయిని గంగాధర్, బనికె ఎల్లయ్య, సంగెపు లక్ష్మి, నారాయణ, గంగాధర్ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్‌ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
దాడి చేసిన వారిపై చర్యలు తీసికోవాలి : జెడ్పీటీసీ
ఆరెపెల్లి సర్పంచ్‌తోపాటు పదిమందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసికోవాలని జెడ్పీటీసీ బాదినేని రాజమణి కోరారు. ఈ దాడిని జెడ్పీటీసీతో పాటు పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, మండల సర్పంచులు, నాయకులు ఖండించారు.