మాట్లాడుతున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హఫీజ్‌పేట్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేమని, ఇంజినిరింగ్ ఫీల్డ్ ఎంతో విలువైనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) ప్రాంగణంలో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ–20 సమ్మిట్, అంతర్జాతీయ సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజినీర్లు భారతదేశంతోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి వారికి అందరికీ అందేలా చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ రంగంలో ఉండే వాళ్లు మొదట వారి అమ్మను సంతోషపరిచేలా చేస్తే దేశాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారన్నారు. 2030 నాటికి విద్యుత్‌కు ప్రత్యామ్నాంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్నారు.
ప్రతియేటా దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో 50 మిలియన్ కొత్త కనెక్షన్లు అందిస్తున్నామని, ఇవి మరింత పెరిగేలా చూడాలన్నారు. విద్యుత్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. 2070 ఎనర్జీ డిమాండ్ గణనీయంగా పెరగడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం సంతోషించదగ్గవిషయమని, 70 నుంచి 80 శాతం విద్యుత్‌ను సోలార్ ద్వారా వినియోగించేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు.
భారత దేశం ఆర్థిక రంగం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మరింత పటిష్టంగా మారుతోందన్నారు. చంద్రుడిపై అడుగిడడం కూడా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని, అందరినీ అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అధ్యక్షుడు శివానంద్ రాయ్, ఆర్టనైజింగ్ కమిటీ చైర్మన్ పి సూర్యప్రకాశ్, ‘ఎస్కీ’ డైరెక్టర్ డాక్టర జి రామేశ్వరరావు ప్రసంగించారు.
తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కీరిట్‌పారిఖ్, ఐఈఐ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఐ సత్యనారాయణరాజు, సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ సీనియర్ ఫెల్లో రాహుల్‌టాంగియా,రీ సస్టేనబిలిటీ లిమిటెడ్, రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర పీజీ శాస్త్రి, హడ్కో సీఎండీ వి సురే‹Ù, ప్రణాళికాసంఘం మాజీ కమిషనర్ అశోక్‌కుమార్ జైన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment