కబళించిన కరెంట్‌ తీగ  | Current Shock killed the Village electrical worker, | Sakshi
Sakshi News home page

కబళించిన కరెంట్‌ తీగ 

Published Wed, Jul 18 2018 2:01 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

Current Shock killed the Village electrical worker, - Sakshi

ట్రాన్స్‌ఫార్మర్‌పై పర్శరాములు మృతదేహం

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరెంట్‌ కాటుకు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఇద్దరు బలయ్యారు. ఫ్యూజ్‌ వైరు సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేములవాడ రూరల్‌ మండలం ఫాజుల్‌నగర్‌కు  చెందిన పర్శరాములు రెండేళ్లుగా విలేజీ ఎలక్ట్రికల్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ట్రాన్స్‌ ఫార్మర్‌ ఫ్యూజ్‌ తెగిపోవడంతో సరిచేసేందుకు పైకి ఎక్కాడు.

విద్యుత్‌ సరఫరా నిలిపివేసి ఫ్యూజు సరిచేస్తున్నాడు. కొంతదూరంలోని మైనర్‌ ఫీడర్‌ తీగ ట్రాన్స్‌ఫార్మర్‌కు అనుసంధానించిన తీగకు తాకింది. దీంతో విద్యుత్‌ సరఫరా జరిగి పర్శరాములు ట్రాన్స్‌ఫార్మర్‌పైనే దుర్మరణం చెందాడు.

గాలిపల్లిలో: ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌కు రెండువైపులా విద్యుత్‌ లైన్లు ఉన్నాయి. అసిస్టెంట్‌ హెల్పర్‌ మిట్టపెల్లి తిరుపతిరెడ్డి (35) ఒకవైపు  కరెంట్‌ సరఫరా బంద్‌ చేసి, ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి ఎక్కి ఫ్యూజు వైరు సరిచేస్తుండగా, మరోవైపు కరెంటు సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement