పేగు బంధం | Monkey Worried About Her Baby Deaths In Chittoor | Sakshi
Sakshi News home page

పేగు బంధం

Jun 9 2018 8:30 AM | Updated on Sep 18 2018 8:38 PM

Monkey Worried About Her Baby Deaths In Chittoor - Sakshi

మృతి చెందిన బిడ్డతో తల్లి వానరం ,బిడ్డను చూస్తూ విలపిస్తున్న తల్లివానరం , దూర ప్రాంతానికి తీసుకు వెళుతూ.. , కుక్కలు రాకుండా దిక్కులు చూస్తూ..

రామసముద్రం : కన్నబిడ్డను కోల్పోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. అటువంటిదే మూగప్రాణి సైతం అనుభవించి పలువురిని కంట తడిపెట్టించింది. ఒక కొమ్మపై నుంచి ఇంకో కొమ్మపైకి ఎగురుతూ కేరింతలు కొడుతున్న పిల్ల వానరం విద్యుత్‌షాక్‌తో ఒక్కసారిగా కిందపడి ప్రాణాలు విడిచింది. కుక్కలు దాని దగ్గరికి వస్తుండగా తల్లికోతి ఒక్క ఉదటున చెట్టుపై నుంచి కిందికి దూకింది. దాన్ని ఒడిలోకి తీసుకుంది. తల్లిపేగు తల్లడిల్లింది. కుక్కలు రాకుండా దిక్కులు చూస్తూ కాపలా కాచింది. సహచర వానరాలు కూడా రావడంతో దాన్ని తీసుకుని దూరంగా వెళ్లింది. ఈ దృశ్యం రామసముద్రం మండలం కుదురుచీమనపల్లెలో శుక్రవారం గ్రామస్తులను కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement