జగన్ పాలనలో విద్యుత్ రంగంలో మెరుపులు
9 గంటల విద్యుత్ కోసం కొత్త ఫీడర్ల ఏర్పాటు
ఇదివరకే ఉన్న ఫీడర్ల సామర్థ్యం పెంపు
కొత్తగా 5 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు
సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.3,099 కోట్ల వ్యయం
రూ.3,400 కోట్లతో రెండు సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం
పునరుత్పాదక రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల ఒప్పందం
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వ హయాం(2004–09) స్వర్ణయుగంలా సాగింది. దేశంలోనే మొదటిసారి ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించారు. ఇందుకు డిస్కంలు వెచి్చంచిన మొత్తాన్ని నయాపైసాతో సహా క్రాస్ సబ్సిడీ రూపంలో వైఎస్సార్ ప్రభుత్వం చెల్లించింది. ఉచిత విద్యుత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా, రైతు బాంధవుడిగా, అపర భగీరథుడిగా, పేదల పక్షపాతిగా, దార్శనికుడిగా ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పాలనలో అన్ని రంగాలూ ప్రగతిపథంలో నడిచాయి. సుభిక్షమైన వర్షాలతో వ్యవసాయం పండగలా సాగింది. ఆ తర్వాత ఆ స్థాయికి మించి రైతులకు మేలు జరిగింది.. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే.
బాబు పాలనలో రైతుకు ఉరి (1995–2003)
9 ఏళ్ల చంద్రబాబు పాలనలో అడుగడుగునా అన్నదాతల ఆక్రందనలే.. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు ఆడిన బాబు వేలాది మంది రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి.. సాగును చిన్నాభిన్నం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ వైఎస్సార్‌ను ఎగతాళి చేశారు.
మరోసారి బాబు షాక్ (2014– 2019)
మరోసారి చంద్రబాబు పాలన. 2014 –19 మధ్య చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఉచిత విద్యుత్ అందించినందుకు డిస్కంలకు సబ్సిడీలు చెల్లించకుండా పెండింగులో పెట్టి అప్పుల భారం పెంచేశారు. విద్యుత్ కొనుగోలు, సరఫరా మధ్య అంతరాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేయకుండా డిస్కంల వ్యవస్థను నాశనం చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు.
జగన్ పాలనలో విద్యుత్ ధగధగలు (2019–2024)
జగన్ ప్రభుత్వం రాకతో డిస్కంలకు సబ్సిడీలు చెల్లించడంతో పాటు.. విద్యుత్ కొనుగోలు – సరఫరా మధ్య అంతరాలు ట్రూఅప్ రూపంలో కొంత సర్దుబాటు చేశారు. రైతులకు నాణ్యమైన 9 గంటల విద్యుత్ కోసం కొత్త ఫీడర్ల ఏర్పాటుతో పాటు, పాతవాటి సామర్థ్యం పెంచారు. పేదలు, రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే సబ్సిడీ భరించి.. మొత్తం రూ.46,581 కోట్లను విద్యుత్ సబ్సిడీగా అందించారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవస్థను బలోపేతం చేశారు. విద్యుత్ వృథా కనీస స్థాయికి తగ్గించి, చోరీలకు చెక్ పెట్టారు. పారదర్శక బిల్లుల విధానం కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా సంస్కరణలు తీసుకొచ్చారు.
వైఎస్సార్ పాలన స్వర్ణయుగం(2004–2009)
తన పాదయాత్రలో రైతు కష్టం తెలుసుకుని.. ఆ రైతుకు ఏం కావాలో గుర్తించి అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు రాజ్యానికి శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్, సాగుకు 9 గంటల విద్యుత్ సరఫరాతో రైతుల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు.
జగన్ పాలనలో వెలుగుల పంట
రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసేవారు. ఇందులో 9 గంటల పగటి పూట విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న ఫీడర్లు 3,854 మాత్రమే. మిగిలిన 2,809 ఫీడర్లకు జగన్ ప్రభుత్వం వచ్చాకే అదనపు సామర్థ్యం కలి్పంచారు. 2023లో రూ.2,479 కోట్లతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.620 కోట్లతో నిరి్మంచిన 12 సబ్‌స్టేషన్లను సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం రూ.3,099 కోట్లను వెచ్చించారు.
చంద్రబాబు హయాంలో విద్యుత్ సంస్థల అప్పులు (రూ. కోట్లలో)
సంస్థ పేరు 2014నాటికి 2019నాటికి పెరిగినవి
ఏపీజెన్‌కో 15,712.32 40,750.89
ఏపీఎస్పీడీసీఎల్ 7,140.32 14,336.15
ఏపీఈపీడీసీఎల్ 4,159.15 5,448.4
ఏపీ ట్రాన్స్‌కో 2,691.25 8,060.83
మొత్తం 29,703.04 68,596.27
విద్యుత్ కొను‘గోల్‌మాల్’
బాబు హయాంలో వాస్తవ ఖర్చులు ఎప్పటికప్పుడు చూపకపోవడంతో నిర్దేశించిన దానికన్నా వ్యయం పెరిగిపోయింది. ఫలితంగా డిస్కంలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సి వచ్చింది. వాటిపై నిరంతరం వడ్డీలు కడుతూ అవి తీర్చలేక మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి. 2016–17 మధ్య బిడ్డింగ్ ప్రక్రియలో పవన విద్యుత్ రూ.2.50 «నుంచి రూ. 2.75 ధరతో కొనుగోలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నా, పలు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల ద్వారా యూనిట్ రూ.4.84కు దాదాపు 3000 మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పీపీఏలతో ఏడాదికి రూ.660 కోట్ల అదనపు భారం ఖజానాపై పడింది.
బాబు హయాంలో రాత్రి పూటే కరెంటు
వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటలు కరెంటు సరఫరా చేయాలి. బాబు హయాంలో ఆరేడు గంటలు మాత్రమే అది కూడా రాత్రిపూటే సరఫరా చేశారు. దీంతో నీటి తడులు పెట్టేందుకు పొలాలకు వెళ్లే రైతుల్లో చాలా మంది పాము కాటుకు గురై మరణించారు. చీకట్లో అనేక మంది రైతులు విద్యుదాఘాతంతో మరణించిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంతో పోలి్చతే 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. అయినప్పటికీ రైతులకు మేలు చేసేలా విద్యుత్ సరఫరా జరిగిన దాఖలాల్లేవు.
బాబు చీకట్లను పారదోలిన జగన్
చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం 5 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. పెండింగులో ఉన్న వ్యవసాయ దరఖాస్తుదారులందరికీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. దరఖాస్తు చేసిన వెంటనే కొత్త కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19.21 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఐదు లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. 39.64 లక్షల మంది లబి్ధదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) మొత్తం రూ.46,581 కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించారు.
సోలార్, పవన విద్యుత్‌తో మంచిరోజులు
రూ.3,400 కోట్లతో కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్‌పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి వీటితో రానున్న రోజుల్లో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే విద్యుత్ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుంది. వేసవిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 260 మిలియన్ యూనిట్లకు పెరిగినా పక్కా ప్రణాళికతో కోతలు లేకుండా సరఫరా చేస్తారు.
►రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్ రూ.2.49తో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13 వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 2024 సెప్టెంబర్‌కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.
స్మార్ట్ మీటర్లతో వృథా, చోరీలకు చెక్
విద్యుత్ వినియోగం పక్కాగా లెక్కకట్టి, వృథా, చోరీల్ని నియంత్రించడమే లక్ష్యంగా డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చి రైతు ఎంత విద్యుత్ వినియోగించుకున్నారో పక్కాగా లెక్కగట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు యూనిట్ వ్యయాన్ని లెక్కించి రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా జమచేస్తారు. రైతులపై పైసా భారం పడకుండా జగన్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది.
► అధికారంలోకి వచ్చాక సామాన్యులపై 41.04 శాతం భారం మోపిన చంద్రబాబు
► విద్యుత్ రంగాన్ని అనవసర పీపీఏలతో గాడి తప్పించిన గత టీడీపీ ప్రభుత్వం
► సబ్సిడీలు చెల్లించకుండా, ట్రూఅప్ ఛార్జీలపై తప్పుడు లెక్కలతో డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు
► టీడీపీ అధికారంలోకి రావడానికి ముందు రూ.29,703 కోట్లున్న అప్పుల్ని రూ.68,596 కోట్లకు పెంచిన ఘనుడు
► నాడు ఉచిత విద్యుత్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీని నిలిపిన వైఎస్ రాజశేఖరరెడ్డి
►నేడు సంస్కరణలతో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం
బాబు హయాంలో విద్యుత్ చార్జీల పెంపు (యూనిట్‌కు రూ.ల్లో)..
నెలవారీ 2016 2018 పెరుగుదల
వినియోగం (మార్చి) (ఏప్రిల్) శాతం
76 140.10 197.60 41.04
78 145.30 202.80 39.57
80 150.50 208.00 38.21
82 155.70 213.20 36.93
85 163.50 221.00 35.17
88 171.30 228.80 33.57
90 176.50 234.00 32.58
92 181.70 239.20 31.65
95 189.50 247.00 30.34
98 197.30 254.80 29.14
100 202.50 260.00 28.40
రైతు బాంధవుడు వైఎస్సార్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అమలుతో సంచలనం సృష్టించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి రైతులు నయాపైసా చెల్లించనక్కర్లేకుండా ఉచిత విద్యుత్ పొందే అవకాశం లభించింది. ఆ రోజు వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.1,259 కోట్లు రద్దయ్యాయి. దేశంలో మొదటిసారిగా ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఉచిత విద్యుత్ కోసం పంపిణీ సంస్థలు వెచ్చించిన ప్రతి పైసాను ప్రభుత్వం సబ్సిడీగా అందించింది.
విద్యుత్ రంగం ప్రగతిబాట
గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పలు చర్యలు చేపట్టింది. డిస్కంలకు ఠంచనుగా సబ్సిడీలు చెల్లిస్తోంది. దీంతో గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్లను çడిస్కంలకు సబ్సిడీల రూపంలో చెల్లించింది. ఇది గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో చెల్లించినదానికంటే దాదాపు రెండున్నర రెట్లు అధికం కావడం గమనార్హం. జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పక్కాగా ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత సరఫరా చేస్తున్నారు. చేతివృత్తుల వారికి, ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇస్తున్నారు. ఆక్వా రైతుల నుంచి యూనిట్‌కు రూ.1.50 మాత్రమే వసూలు చేస్తూ, రాయితీ రూ.3.50 ప్రభుత్వమే భరిస్తోంది. ఏటా రూ.12 వేల కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది.
బాబు తప్పులు.. డిస్కంలకు అప్పులు
చంద్రబాబు ఏలుబడి(2014–19)లో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. బాబు సర్కారు డిస్కంలకు క్రాస్ సబ్సిడీని సక్రమంగా చెల్లించలేదు. విద్యుత్ కొనుగోలు, సరఫరా మధ్య అంతరాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేయలేదు. దీంతో డిస్కంలు దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేసవిలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు దిగిపోయే నాటికి డిస్కంలకు ప్రభుత్వం రూ.13 వేల కోట్లకు పైగా బకాయి పెట్టింది. 2014–15 నుంచి 2018–19 మధ్య పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసరాలు తక్కువ చేసి చూపడంతో నిర్దేశిత వ్యయం కంటే వాస్తవ వ్యయం రూ.19 వేల కోట్లు ఎక్కువైంది.
ఈ మొత్తంపై ట్రూ ఆప్ సవరణల కోసం విద్యుత్ నియంత్రణ మండలికి నివేదికలు సమరి్పంచలేదు. గత ప్రభుత్వం హయాంలో వార్షిక ఆదాయ, ఖర్చుల నివేదికలు సక్రమంగా సమరి్పస్తే.. ప్రభుత్వం కూడా ఆమేరకు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చేది. సబ్సిడీ భారాన్ని తప్పించుకునేందుకు వాస్తవ వ్యయం చూపకపోవడంతో డిస్కంలు నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో బాబు హయాంలో సబ్సిడీ పెండింగులో పెట్టిన మొత్తం రూ.13 వేల కోట్లు, వాస్తవాలు చూపకపోవడంవల్ల ఏర్పడిన నష్టం రూ.19 వేల కోట్లు కలిపి మొత్తం రూ.31 వేల కోటక్లుపైగా డిస్కంలు నష్టాల్లో కూరుకుపోవాల్సి వచి్చంది.
మా మంచి కోసం
స్మార్ట్ మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, చోరీ, మరమ్మతులకు గురైనా ఆ ఖర్చులు విద్యుత్ కంపెనీలే భరిస్తాయని హామీ ఇచ్చారు. మేం పైసా కట్టకుండా మీటర్ పెడతామన్నారు. మాకు తొమ్మిది గంటలు పగలు కరెంటు ఇస్తున్నారు. దానివల్ల మా పంటలు బాగా పండుతున్నాయి. –ఎం.కృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం
కరెంటుకు ఢోకా లేదు
ఇది వరకు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే ఇబ్బంది పడేవాళ్లం. ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌పై మూడు సరీ్వసులుంటే ట్రాన్స్‌ఫార్మర్ బాగుచేయడానికి ఒకరొస్తే ఇంకొకరు రావడం కుదిరేది కాదు. మోటార్లు ఒకటి కాలిపోతే పక్కవి కూడా కాలిపోయేవి. ఏ మోటర్ దగ్గర సమస్య ఉందో తెలుసుకోవడానికి అన్ని బోర్ల దగ్గరకు తిరిగేవారం. ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు కాలడం చాలా అరుదు. దెబ్బతిన్నా వెంటనే బాగవుతోంది. –రుద్ర సూర్యనారాయణ, కౌలు రైతు, కృష్ణాపురం
Comments
Please login to add a commentAdd a comment