
ఊటుకూరు (గంపలగూడెం) : గంపలగూడెం మండలంలోని ఊటుకూరు గ్రామంలో విద్యుదాఘాతంతో మామాకోడళ్లు దుర్మరణం చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల నుంచి సేకరించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల అంజియ్య (51), కోడలు చంద్రావతి (31) ఈ సంఘటనలో మృత్యుఒడికి చేరారు. కోడలు చంద్రావతి బట్టలు ఆరవేస్తుండగా వైరుకు విద్యుత్ ప్రసారం జరిగింది. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. కోడలిని రక్షించే ప్రయత్నంలో మామ అంజయ్యకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి ముగ్గురు సంతానం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యుత్ ప్రమాదంలో తనువుచాలించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు పెద్దసంఖ్యలో వచ్చి మృతదేహాల్ని సందర్శించి వెళ్లారు.
బట్టలు ఆరేస్తుండగా ఆమెను విద్యుదాఘాతం విగతజీవిగా మార్చింది. కోడలిని రక్షించేందుకు వెళ్లి మామకు కూడా విద్యుత్ షాక్ తగిలి మృత్యుఒడికి చేరాడు. గంపలగూడెం మండలంలోని ఊటుకూరు గ్రామంలో సోమవారం రాత్రి ఆ కుటుంబంలో కాళరాత్రిని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment