సాక్షి, వట్‌పల్లి(అందోల్): మండలంలోని ఖాది రాబాద్ గ్రామంలో ఎమ్మెల్యే బాబూమోహన్ పర్యటన ఉద్రిక్తతకు దారిసింది. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే బాబూమోహన్‌కు స్థానిక సర్పంచ్ రమేశ్‌జోషి మధ్య విద్యుత్ ఉపకేంద్రం వివాదం చెలరేగింది. గ్రామంలో ఏర్పాటుచేసిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇంత వరకు వినియోగంలోకి రాలేదని, అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటానని సమాధానం ఇచ్చారు.
మూడేళ్లుగా ఇవే మాటలు చెబుతూ గ్రామస్తులను మోసం చేస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని సర్పంచ్ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం నువ్వేంత అంటే నువ్వెంత అని, చూసుకుందామంటే చూసుకుందామనే స్థాయికి వెళ్లింది. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని స్థానికులు భయాందోళలకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే కలుగజేసుకొని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment