డైరీ ఆవిష్కరణలో ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఘనత ఆ శాఖ ఇంజనీర్లదేనని..దీన్ని జీర్ణించుకోలేని కొందరు వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రాధాన్యతని స్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం అమలవుతోందన్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో శనివారం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ–2018 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి మద్దతుతో విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించామని, ఇది సమష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. విద్యుత్ సరఫరా, బిల్లుల వసూళ్లు, నష్టాల నివారణ వంటి అంశాల్లో అకౌంట్స్ ఆఫీసర్లు ఇంజనీర్లకు సలహాలివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య, అధ్యక్షుడు ఎన్.అశోక్, ప్రతినిధులు శంకర్, వి.పరమేశ్, అనురాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment