
740 మంది ఆత్మహత్య చేసుకున్నా...
నల్లగొండ జిల్లా (భువనగిరి): విద్యుత్ సమస్యతో 740 మంది రైతులు చేసుకున్న ఆత్మహత్యలకు బాధ్యులు మీరుకారా అన్ని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రికి ద్యాసలేదన్నారు.మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం ప్రధానమైన విద్యుత్ సమస్యపై దృష్టిపెట్టి ఉంటే ఇంతమంది రైతులు చనిపోయేవారా అని ప్రశ్నించారు. రైతులు విద్యుత్ సమస్యతో చనిపోతున్నారని ఊరూర ఆధారాలు చూపినా ముఖ్యమంత్రికి పట్టింపులేదన్నారు. పరిపాలనలో అపరిపక్వత, ప్రజాసామ్యం ముసుగులో నియంతృత్వం కొనసాగుతుందన్నారు. విద్యుత్ సమస్యపై ఎదురౌతున్న సమస్యలపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్నారు.
కనీసం రాష్ర్టంలో అఖిల పక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. గాలిపర్యటనలతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధానమైన ప్రజా సమస్యలను గాలికొదిలిన ముఖ్యమత్రిపై ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాచని హెచ్చరించారు. అచరణకు సాద్యంకాని హామిలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటికైనా గాలిమాటలు కట్టిపెట్టి ఇచ్చిన హామిలు నెరవేర్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. పూటకో హామీతో కేసీఆర్ ప్రజలకు ఇంకా మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆ భద్రతతో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడన్నారు. దళితులకు మూడు ఎకరాల సాగు భూమ ఇస్తానన్న ముఖ్యమంత్రి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న119 నియోజకవర్గాల్లో దళితులకు కొన్ని ఇచ్చే భూములకు సుమారుగా 2,67,750 కోట్ల నిధులు అవసరం అవుతాయన్నారు. ఇంతవరకు ఆ నిధులఊసే లేదన్నారు.ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు ఎప్పడిస్తావని ప్రశ్నించారు.
రెండు గదులు ఇళ్ల నిర్మాణానికి ఇంత వరకు జీవో ఎందుకు జారీ చేయలేదని నిలదీశారు. విద్యార్థులకు ఇంతవరకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. అర్హులందరికి పించన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వారిని ఎందుకు యాతనకు గురి చేస్తున్నావ ని ప్రశ్నించారు. ఎన్నికలముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎర్రగడ్డ వైపు ఎందుకు చూస్తున్నావని ఆయన ఎద్దెవా చేశారు. కేసీఆర్ ఎర్రగడ్డవైపు వెళ్లోద్దని భగవంతున్ని వేడుకుంటున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికి ప్రజలు ఇచ్చిన ఓటమి తీర్పును స్వీకరిస్తూనే ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉద్యమిస్తుందన్నారు. ప్రపంచంలో 3 వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అన్న విషయాన్ని గుర్తుందచుకోవాలన్నారు. ఈసమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడిద బిక్షమయ్యగౌడ్, నాయకులు గూడూరు నారాయణరెడ్డి,తంగెల్లపల్లి రవికూమార్,పోతంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.