మంత్రి పొన్నాలకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లందంటూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేసిన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. 2009 ఎన్నికల్లో జనగాం శాసనసభ స్థానం నుంచి 236 ఓట్ల మెజారిటీతో పొన్నాల లక్ష్మయ్య గెలుపొందారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదంటూ పొన్నాల ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల ఫలితాల వెల్లడిలో అక్రమాలు జరిగాయని, ఓడిన పొన్నాలను గెలుపొందినట్లు ప్రకటించారని నాటి నుండి టిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇదే వాదనతో అప్పటి టిఆర్‌ఎస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, పొన్నాల ఎన్నికపై 2010లో కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును పొన్నాల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణపై అదే ఏడాది సుప్రీంకోర్టు స్టే విధించింది. నాటి నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది.