kommuri pratap reddy
-
కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న వర్గపోరు
జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.రెండు వర్గాలుగా విడిపోయి..పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది. హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్ చైర్మన్ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి. -
ఓటమి భయంతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం..!
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ, పోస్టర్ వార్
-
భట్టికే చెమట్లు పట్టించారు.. కాంగ్రెస్ నుంచి గెంటేసుకున్న పొన్నాల, కొమ్మూరి
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కీలక మంత్రిగా హవా నడిపారు. పార్టీకి అధికారం పోయింది. పదవులు చేజారిపోయాయి. ఇప్పుడు టిక్కెట్ తెచ్చుకోవడమే ఆ మాజీ పీసీసీ చీఫ్‌కు కష్టమంటున్నారు. గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేసిన నేతే ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నాడు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నేనేంటే నేనే అంటూ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామలో పోరు యాత్రగా మారింది. రెండు వర్గాలు ఒకరిని మరొకరు కుమ్మేసుకున్నారు. తోసుకున్నారు. తిట్టుకున్నారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పాదయాత్రలో లొల్లి షురూ.. భట్టి విక్రమార్కకే చెమట్లు పట్టించారు పొన్నాల, కొమ్మూరి. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. గత ఎన్నికల్లో పొన్నాల ఓటమితో ఈసారి కొమ్మూరి టిక్కెట్‌పై ఆశలు పెంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. చాన్నాళ్ళుగా సైలెంట్ ఉన్న వ్యవహారం భట్టి పాదయాత్ర సందర్భంగా రోడ్డున పడింది. ఈ తరుణంలో పొన్నాల అనుచరుడైన డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనపల్లి లింగాజీ కొమ్మూరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కొమ్మూరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. అదే సమయంలో కొమ్మూరి అనుచరులు పొన్నాలనే పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని, పార్టీని పట్టించుకోకుండా అధికార పార్టీకి కోవర్ట్ గా మారి జనగామలో హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాడని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పోటా పోటీ ఫిర్యాదులతోపాటు భట్టి పాదయాత్రలో తమ సత్తా చాటేందుకు యత్నించారు. భట్టి కూడా ఈ న్యూసెన్స్ ఏంటని ఇరువర్గాలను తీవ్రంగా మందలించారు. (హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్) సైడయిపోయిన కొమ్మూరి కొమ్మూరి వస్తే పాదయాత్రకు సహకరించబోనని పొన్నాల స్పష్టం చేయడంతో.. ఒకదశలో భట్టి రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళమని కొమ్మూరికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొమ్మూరి పాదయాత్ర నుంచి నిష్క్రమించారు. నర్మెట్టలో కార్నర్ మీటింగ్ పెట్టేందుకు పొన్నాల ఏర్పాటు చేయగా కొమ్మూరి వర్గీయులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేసేది లేక భట్టి కార్నర్ మీటింగ్ ను క్యాన్సల్ చేసుకుని ముందుకు సాగారు. దీంతో పొన్నాల అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొమ్మూరి అనుచరులను సభా వేదిక వద్దకు ఎలా అనుమతిచ్చారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. కొమ్మూరి మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో భట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని పొన్నాల సైకోయిజం వల్లనే పాదయాత్ర కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు భట్టి పాదయాత్ర సాగగా ఫస్ట్ డే మాత్రమే భట్టితో కొమ్మూరి కనిపించారు. పొన్నాల మాత్రం ఆది నుంచి అంతం వరకు అన్నీ తానై భట్టిని నడిపించారు. ఉల్టా పల్టా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నాల నియోజకవర్గానికి దూరం కాగా.. కొమ్మూరి మాత్రం అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలతో మమేకమ్యారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్నారు. కొమ్మూరికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న పొన్నాల.. భట్టి విక్రమార్క పాదయాత్రను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు తన చేతితో అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చిన పొన్నాల ఇప్పుడు తనకు టిక్కెట్ వస్తుందో రాదో అన్న దీనస్థితికి దిగజారిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!) -
అప్పుల రాష్ట్రంగా మార్చారు కేసీఆర్‌పై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక రాష్ట్ర ఖజానాను దివాలా తీశారని ఆరోపించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తూ వారిని అర్ధాకలితో గోసపెడుతున్నారని ఓ ప్రకటనలో అవేదన వ్యక్తం చేశారు. పథకాలకు నిధులు విడుదల చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
బీజేపీకి సీనియర్ నేత గుడ్ బై..
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. జనగామ బీజేపీలో క్రమశిక్షణ లోపించిందని, అందుకే బీజేపీకి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. అయితే, ఇటీవల మంత్రి హరీష్‌రావును కలువడంలో ఎలాంటి రాజకీయం లేదని, తన రాజీనామాకు, ఈ భేటీకి సంబంధం లేదని కొమ్మూరి అంటున్నారు. ఆయన మీడియాతో ఏమన్నారంటే.. ‘గత నాలుగు ఏళ్లుగా బీజేపీలో ఉన్నాను. జనగామ ప్రజల, అభిమానుల కోరిక మేరకు ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. నాతోపాటు అన్ని మండలాల్లోనూ మద్దతుదారులు బీజేపీకి రాజీనామా చేస్తున్నారు. నాలుగేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పని చేసాను. గత ఏడాది నుండి నా మీద ఒత్తిడి ఉంది. 2001 నుండి నేను టీఆర్ఎస్లో ఉన్నాను. జడ్పీటీసీ, ఎమ్మెల్యే గా గెలిచాను. ఆ తర్వాత బీజేపీలో చేరాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశాను. జనగామ బీజేపీలో క్రమశిక్షణ లేదు. సరి చేయడానికి ప్రయత్నం చేసినా కుదరలేదు. అదికూడా నా రాజీనామాకు కారణం. జిల్లా ప్రజల అభీష్టం మేరకు వారు చెప్పిన విధంగా నడుచుకుంటా.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే హరీష్‌రావును కలిశాను. రాజకీయాలు మాట్లాడలేదు’ అని కొమ్మూరి తెలిపారు. -
మంత్రి పొన్నాలకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లందంటూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. 2009 ఎన్నికల్లో జనగాం శాసనసభ స్థానం నుంచి 236 ఓట్ల మెజారిటీతో పొన్నాల లక్ష్మయ్య గెలుపొందారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదంటూ పొన్నాల ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో అక్రమాలు జరిగాయని, ఓడిన పొన్నాలను గెలుపొందినట్లు ప్రకటించారని నాటి నుండి టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే వాదనతో అప్పటి టిఆర్ఎస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, పొన్నాల ఎన్నికపై 2010లో కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును పొన్నాల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణపై అదే ఏడాది సుప్రీంకోర్టు స్టే విధించింది. నాటి నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది.