పొన్నాలకు కోర్టులో శిక్ష తప్పదు | Ponnalaku court has sentenced | Sakshi
Sakshi News home page

పొన్నాలకు కోర్టులో శిక్ష తప్పదు

Published Fri, Apr 18 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

Ponnalaku court has sentenced

  • తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి
  •  బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం ఎగిసి పడిన ఉద్యమాన్ని అణచివేసేం దకు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అనేక కుట్రలు చేశా డు.. విద్యార్థులను తీవ్ర ఇబ్బం దులకు గురిచేశాడు.. తనపై చేయించిన దాడి కేసు కోర్టులో నడుస్తోంది.. ఆయనకు శిక్ష తప్పదని తెలంగాణ జిల్లాల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, కేయూ విద్యార్థి డాక్టర్ యాకూబ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపాడు.

    మండల కేంద్రంలో గురువారం టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వడ్డేపల్లి మల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉద్యమానికి ద్రోహం చేసిన పొన్నాల ఓటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నామని చెప్పారు. తల్లి తెలంగాణను కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌లను గెలిపించుకోవడానికి ఊరూ రా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు.

    సమావేశంలో టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షు డు కందుకూరి ప్రభాకర్, కేయూ జేఏసీ కోఆర్డినేటర్ పామాకుల కొమురయ్య, పార్టీ మండల అధ్యక్షుడు నల్లగోని బాలకిషన్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్రి రమణారెడ్డి, ఉల్లెంగుల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement