తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ నేతలు ....తమ తీరు మార్చుకోవటం లేదు.
మెదక్ : తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ నేతలు ....తమ తీరు మార్చుకోవటం లేదు.ఓవైపు మెదక్ లోక్సభ ఉప ఎన్నికకు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని చెబుతూనే మరోవైపు ఘర్షణలకు దిగటం విశేషం. అది కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు.
మెదక్ జిల్లా దుబ్బాక కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సోమవారం రసాభాసగా మారింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఫోటో వేయలేదంటూ ఆయన వర్గీయులు గొడవకు దిగారు. ఫ్లెక్సీలు చించివేసి పొన్నాల ఎదుటే ఘర్షణకు దిగారు. దాంతో అవాక్కవటం పొన్నాల వంతు అయ్యింది.