విజయం నాదే!
- గెలుపుపై అభ్యర్థుల ధీమా
- ఎక్కువ సీట్లలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్
- సొంత లెక్కల్లో మునిగిన అభ్యర్థులు
- అనుచరులతో జోరుగా చర్చలు
- నేతలకు మే 16 వరకు తప్పని టెన్షన్
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గెలుపోటముల చర్చలు మొదలయ్యాయి. అక్కడ అలా అయ్యిందంటే... ఇక్కడ ఇలా జరిగింది అంటూ విశ్లేషణలు ఊపందుకున్నాయి. అభ్యర్థులు.. ప్రచార తీరుతో సంబంధం లేకుండా ఖర్చు లెక్కల ఆధారంగా ఫలితాలను అంచనా వేసుకుంటున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రామాల వారీగా తమకు పోలైన ఓట్లు ఇన్ని అని లెక్కలు వేసుకుంటున్నారు.
మండల స్థాయి నేతలతో చర్చిస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి తమకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసుకుంటున్నారు. మొత్తంగా ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందన్న నిర్ణయానికి వస్తున్నారు. ఇలా.. అభ్యర్థుల ఫలితాల అంచనా ప్రక్రియ మే 16 వరకు కొనసా గే పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థులు ఫలితాల విషయం లో టెన్షన్ పడాల్సిందే. పోలింగ్‌తో నాయకులు, ఓటర్ల నుం చి ఒత్తిడులు తగ్గినా... ఫలితాల విషయంలో ఇప్పుడు అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఆదివారం జరిగిన పోలింగ్ సర ళి ప్రకారం ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-బీజేపీ కూటమి రేసులో బలంగా ఉంది.
జనగామలో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య పోటీ సాగింది.
వరంగల్ తూర్పులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు కనిపించింది. మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, కొండా సురేఖ ల మధ్య ఇక్కడ తీవ్రపోటి ఉంది. నరేంద్రమోడి హవాతో విజయం వరిస్తుందని బీజేపీఅభ్యర్థి రావుప ద్మ భావిస్తున్నారు. ఇక్కడ ఫలితాల పై అభ్యర్థులు, ఓటర్లలోనూ ఉత్కం ఠ ఉంది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్, కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణ మధ్య ప్రధానంగా పో టీ ఉంది. బీజేపీ అభ్యర్థి ఎం.ధర్మారావు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
నర్సంపేటలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి దొంతి మాధవరెడ్డిల మధ్య ప్రధాన పో టీ ఉంది. టీడీపీ అ భ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్, మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి మంద కృష్ణమాదిగల మధ్య పోటీ ఉంది.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ అభ్య ర్థి టి.రాజయ్య, కాంగ్రెస్ అభ్యర్థి జి.విజయరామారావుల మధ్య పోటీ ఉంది.
పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ ర సవత్తరంగా ఉంది. టీఆర్‌ఎస్ అభ్య ర్థి ఎన్.సుధాకర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాసరావు, టీడీపీ అ భ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్క డ వచ్చే ఫలితాలపై అందరిలో ఆసక్తి ఉంది.
ములుగు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎ.చందూలాల్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది.
పరకాలలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి ఎం.సహోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, టీ డీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి బరిలో ఉన్నారు. వీరు ముగ్గురి మధ్య పోటీ ఉంది.
భూపాలపల్లి నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ ఉంది. టీఆర్‌ఎస్ అ భ్యర్థి మధుసూధనాచారి, బీజేపీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావుల మధ్య నువ్వా..నేనా.. అన్నట్టు ఉంది. ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.
మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.కవిత, టీఆర్‌ఎస్ నుంచి బానోత్ శంకర్‌నాయక్ పోటీలో ఉన్నారు. వీరి మధ్య పోటీ ప్రధానంగా ఉంది.
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్.రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్‌ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థి సుజాతమంగీలాల్ ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు.