పొన్నాల, కొమ్మూరిపై కేసు
Published Thu, Sep 1 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
జనగామ : జనగామ జిల్లా చేయాలని నినదిస్తూ జూన్ 26న నిర్వహించిన 48 గంటల బంద్‌లో పా ల్గొన్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డితో సహా మరో 18 మంది ఉద్యమకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పొన్నాల లక్ష్మయ్య, దశమంతరెడ్డి మినహా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, 18మంది ఎండీ అన్వర్, ధర్మపురి శ్రీని వాస్, మేడ శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, మాజీద్, మంగళ్లపల్లి రాజు, పిట్టల సురేష్, పెద్దోజు జగదీష్, మహంకాళి హరిచ్చంద్రగుప్త, గుజ్జుల నారాయణ, నాగారపు వెంకట్, ఎల్లయ్య బుధవారం కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి ఎదుట వారిని హాజరుపరుచగా, ఈనెల 5కు కేసు వాయిదా వేశారు. ఏ1గా పొన్నాల లక్ష్మయ్య, ఏ2గా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఏ3గా దశమంతరెడ్డిపై కేసు నమోదు చేశారు. 26వ తేదీన జాతీయ రహదారిపై జరిగిన ఆందోళనలో పాల్గొన్న కారణంగా వీరిపై కేసు నమోదు చే సినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఈ నెల 5కు కేసు వాయిదా వేశారు.
Advertisement
Advertisement