
ఈ బాలుడికి ఎనిమిది వేళ్లు..
ఝరాసంగం రూరల్: సహజంగా మన చేతిక ఐదు వేళ్లు... రెండు చేతులకు కలిపి 10 వేళ్లు ఉంటాయి. కానీ కాని ఝరాసంగం మండలకేంద్రానికి చెందిన బి.తుల్జారాం కుమారుడు మోహన్ (4)కు మాత్రం పుట్టుక నుంచే ఎనిమిది వేళ్లు ఉన్నాయి. విచిత్రం ఎంటంటే ఎడమ చేతికి నాలుగువేళ్లు, కుడి చేతికి నాలుగు వేళ్లున్నాయి. ఎడమ చేతికి చూడడానికి నాలుగువేళ్లు కనిపించి రెండు రెండువేళ్లు అతుక్కొని ఉన్నాయి. ఎడమ చేతికి ఉన్న నాలుగువేళ్లకు అతుక్కొని ఉన్న రెండు వెళ్లు కలిపితే 10 వేళ్లవుతున్నాయి.
ఈ రకంగా చూస్తే కుడి చేతికి నాలుగు వేళ్లు, ఎడమ చేతికి ఆరువేళ్లు ఉన్నాయి. దీంతో ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినప్పుడు తమ బాబును వింతగా చూస్తున్నారని తండ్రి తుల్జారాం తెలిపారు.