
సాక్షి, పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో శివరాత్రి పర్వదినం రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. శివుని మెడలో నిత్యం నాగుపాము ఉండడం పరిపాటి. గోధుమ వర్ణం కలిగి ఉన్న అలాంటి నాగుపాము పాత జైన దేవాలయం వద్ద సోమవారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పడగ విప్పి అటు ఇటు తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని తిలకించిన పలువురు సెల్‌ఫోన్లలో ఫొటో తీసి వాట్సప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని నాగుపామును దర్శించారు. పలువురు మహిళలు ప్లేటులో పాలు తీసుకొచ్చి పాము వద్ద ఉంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి అద్భుతం చోటు చేసుకోవడం నిజంగా శివుని మహిమేనని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment