సాక్షి, అమరావతి : కేంద్రం నుంచి తమ పార్టీ మంత్రులను ఉపసంహరించుకుని, ఇంకా ఎన్‌డీఏలో కొనసాగుతున్న టీడీపీ తీరుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే. విమర్శలను తిప్పికొట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, కళ వెంకట్రావు, పయ్యావుల కేశవ్‌లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తాజా రాజకీయ పరిణామాలపై ప్రతిరోజు చంద్రబాబుతో చర్చించనుంది. అలాగే ఆదివారం జరగనున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment