బాబుతో గొడవ.. అమిత్‌ షా వ్యాఖ్యలు!! | BJP President Amit Shah comments on Chandrababu | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 17 2018 7:18 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

 BJP President Amit Shah comments on Chandrababu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్పందించారు. చంద్రబాబుతో తమకు ఎలాంటి గొడవ లేదని, ఆయనతో గొడవ పెట్టుకోవాలని కూడా తాము అనుకోలేదని షా చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనకు తానుగానే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఆందోళనలు రాష్ట్రంలో మిన్నంటుతుండటం, కేంద్రంతోపాటు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో, నెపాన్ని మోదీ ప్రభుత్వంపై నెట్టేందుకు నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామాపై కూడా అమిత్‌ షా స్పందించారు. ఏపీ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement