పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక కమిటీలు
Published Thu, Aug 4 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
మాడుగుల: గ్రామాల్లో పారిశుధ్యం మెరుగకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేస్తున్నామని డీపీవో కృష్ణకుమారి అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పారిశుధ్య కమిటీల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 550 క్లస్టర్లు ఉండగా వీరిలో 376 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు, గుమస్తాలు ఉన్నారని చెప్పారు. జిల్లాలో రూ.40 కోట్ల ఇంటి పన్నుల వసూలకు ఇప్పటివరకు రూ.40 కోట్లు మాత్రమే వసూలైందన్నారు. విద్యుత్ బకాయిలు రూ.13 కోట్లలో రూ.7 కోట్లు వసూలైందన్నారు. ఆక్రమణకు గురవుతున్న పంచాయతీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఈవో సత్యనారాయణను ఆదేశించారు. పంచాయతీ షాపింగ్ కాంప్లెక్సు అద్దె వసూలుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయనను ఆదేశించారు. వారపు సంతల్లో గిడ్డంగులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈవోపీఆర్డీ కొంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement