తల్లీబిడ్డల ఆరోగ్యమే అభిమతం
♦ మహిళా అధికారులతో ప్రత్యేక కమిటీ
♦ గర్భిణుల ప్రోత్సాహకం, కేసీఆర్ కిట్స్‌పై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గర్భిణులకు ప్రసవ సమయంలో ప్రభు త్వం అందించే ఆర్థిక సాయం, నవజాత శిశువులకు బçహూక రించే కేసీఆర్ కిట్స్ ద్వారా తల్లీబిడ్డలకు ఆరోగ్య అలవాట్లను అందించాలన్నదే తమ అభిమతమని సీఎం కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రసవ మరణాలు సున్నా శాతా నికి పడిపోవాలని, భావితరం ఆరోగ్యంగా ఎదగాలని ఆకాం క్షించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకునే పేద మహిళలకిచ్చే రూ. 12 వేల ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్స్ పథకాల అమలుపై గురువారం ప్రగతి భవన్‌లో సీఎం సమీ క్షించారు. ‘కేసీఆర్ కిట్’ ద్వారా అందించే వస్తువులను పరిశీ లించారు. మస్కిటో మెష్, సబ్బులు, షాంపూలు, పౌడర్లు, టవళ్లు, డైపర్లు ఇందులో ఉన్నాయి.
ఇప్పటికే కిట్స్ సరఫరా కు టెండర్లు పిలిచామని, మే నుంచి కిట్స్ అందిస్తామని ఆరో గ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ చెప్పారు. రూ.12 వేల ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి కార్యక్ర మాల అమలుకు కార్యాచరణ రూపొందించేందుకు అధికారు లతో ప్రత్యేక కమిటీని నియమించారు. దీనిలో శాంతి కుమారి, వాకాటి కరుణ, స్మితా సబర్వాల్, యోగితా రాణా, ప్రియాంక వర్గీస్ సభ్యులుగా ఉండనున్నారు.
గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు...
‘‘నెలలు నిండాక కూడా పేద గర్భిణులు కుటుంబం గడవ డానికి పనులు చేస్తూనే ఉన్నారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బ తినటంతోపాటు పుట్టే పిల్లలపైనా ప్రభావం పడుతుంది. అందుకే గర్భిణులు నెలలు నిండినప్పటి నుంచి శిశువులకు జన్మనిచ్చి వారికి 2, 3 నెలల వయసు వచ్చే వరకు కూలి పనులకు వెళ్లకుండా కుటుంబ అవసరాలు తీరాలనే ఉద్దేశం తో సాయం అందించాలని నిర్ణయించాం.
ప్రభు త్వాస్ప త్రుల్లో కాన్పు అయిన పేద మహిళలందరికీ రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే మరో రూ. వెయ్యి అదనంగా ఇస్తాం. ఈ సాయం ఎన్ని విడతల్లో అందించాలి, గర్భిణులకు ఏ నెల నుంచి ఇవ్వాలనేది అధికారులు నిర్ణయిస్తారు. గర్భిణుల పేర్లను నమోదు చేయించాలి. వారికి అవసరమైన మందులు అందించాలి. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలున్నారు. ఈ పనులకు ఎవరిని ఉపయోగించు కుంటే బాగుంటుందో నిర్ణయించాలి.
శిశువులకు కేసీఆర్ కిట్స్‌తో ఆరోగ్యవంతమైన సంరక్షణ ప్రారంభమవుతుంది. ప్రసవ మరణాలు తగ్గుతాయి. తల్లీబిడ్డలు క్రమం తప్పకుం డా ఆస్పత్రులకు వస్తే టీకాలు, మందులు సకాలంలో అం దుతాయి’’ అని సీఎం చెప్పారు. ఒంటరి మహిళలకు రూ. వెయ్యి భృతి అందించాలని నిర్ణయించినందున.. ఒంటరి మహిళలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సాయంతో వారి పోషణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి కూడా ఊరటగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.