థియేటర్స్‌లోకి రా భాయ్‌ | Film exhibitors urge Salman Khan to not take Radhe to OTT | Sakshi
Sakshi News home page

థియేటర్స్‌లోకి రా భాయ్‌

Published Mon, Jan 4 2021 12:35 AM | Last Updated on Mon, Jan 4 2021 2:54 AM

Film exhibitors urge Salman Khan to not take Radhe to OTT - Sakshi

సల్మాన్‌ ఖాన్

ప్రస్తుతం సినిమా థియేటర్స్‌ పరిస్థితి కాస్త సందిగ్ధంలో ఉంది. ఏదైనా పెద్ద సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారని ఓ వాదన. ప్రేక్షకులు వచ్చేలా ఉంటేనే పెద్ద సినిమా తీసుకొద్దాం అనేది మరో వాదన. సల్మాన్‌ లాంటి స్టార్‌ సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా వస్తారని బాలీవుడ్‌ థియేటర్‌ యాజమాన్యం భావిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ నటించిన తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాధే’ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ తరుణంలో ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ‘రాధే’ను థియేటర్స్‌లోనే విడుదల చేయమంటూ ఓ లేఖ ద్వారా కోరింది. ఇలాంటి కష్టసమయంలో థియేటర్స్‌ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని, సల్మాన్‌ చిత్రం అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటాయని, ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్‌కి తీసుకొచ్చే స్టామినా ఉన్న స్టార్‌ సల్మాన్‌ అనేది ఈ లేఖ సారాంశం. ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్‌ అని సల్మాన్‌ని కోరారు. మరి భాయ్‌ సినిమా థియేటర్స్‌లో వస్తుందా? వేచి చూడాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement