
జ్యోతిక
థియేటర్స్ మూసేసి నెల రోజులు దాటిపోయింది. దీంతో రిలీజ్‌కి రెడీ అయిన చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు కొందరు నిర్మాతలు. ఇందులో భాగంగా సూర్య నిర్మాణంలో జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనుకున్నారు. ముందు ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అంగీకరించలేదు. భవిష్యత్తులో సూర్య నిర్మాణంలో వచ్చే చిత్రాలను ప్రదర్శించబోమని ప్రకటించారు.
అయితే ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని డిజిటల్ ద్వారా రిలీజ్ చేయడం సరైన నిర్ణయమే అని నిర్మాతల సంఘం అభిప్రాయపడింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సినిమాను ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాత ఇష్టం. చిన్న సినిమాలను మరియు మీడియమ్ బడ్జెట్ సినిమాలను ఆన్ లైన్‌లో రిలీజ్ చేయడం నిర్మాతలకు కలసి వచ్చే విషయమే. అలాగే లాక్ డౌన్ తీసేసిన తర్వాత రిలీజ్‌కి భారీ క్యూ ఉండి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి రాదు’’ అని నిర్మాతల సంఘం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment