
ఛాన్స్ అడిగితే... ఆ ఛాన్స్ అడుగుతున్నారు!
కెరీర్‌ను కష్టంతో అల్లుకోవాలి. కానీ, ఇక్కడేమో నవ్వారుతో అల్లేస్తున్నారు. ఎన్నో కలలు, ఆశలతో రంగుల లోకంలో అకాశమంత ఎత్తుకి ఎగరాలని వచ్చినోళ్లను రెండు కాళ్లపై ఎదగనివ్వక నాలుగు కోళ్ల నవ్వారుపైకి రావాల్సిందేనంటున్నారు! ఈ మాటలంటున్నది ఎవరో కాదు... రత్తాలు రాయ్ లక్ష్మి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) ఉందన్నారామె.
‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్ మేకర్స్ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీకి సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం (స్లీప్ అరౌండ్) వస్తారు’’ అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టారు రాయ్ లక్ష్మి. ‘‘తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీళ్లు వదలడం లేదు.
తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను కొందరు ఫిల్మ్ మేకర్స్ సినిమా నుంచి తప్పిస్తున్నారు’’ అని బోల్డ్‌గా చెప్పేశారీ బ్యూటీ. ‘కాస్టింగ్ కౌచ్’ అన్ని ఇండస్ట్రీలలోనూ ఉందన్నారు. నిజం చెప్పాలంటే తనకెప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు.