నిర్మాతల్ని హడలెత్తిస్తున్న హన్సిక | Hansika Motwani hopes for a successful run in 2015 | Sakshi
Sakshi News home page

నిర్మాతల్ని హడలెత్తిస్తున్న హన్సిక

Published Sat, Jan 3 2015 1:52 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

నిర్మాతల్ని హడలెత్తిస్తున్న హన్సిక - Sakshi

నిర్మాతల్ని హడలెత్తిస్తున్న హన్సిక

నటి హన్సిక నిర్మాతలను హడలెత్తిస్తున్నట్టు ప్రచారం జోరందుకుంటోంది. నిజానికి ఈ ఉత్తరాది బామకు కోలీవుడ్‌లో మంచి పేరు ఉంది. షూటింగ్‌లకు డుమ్మా కొట్టకుండా క్రమం తప్పకుండా, నిర్ణీత సమయానికి హాజరవుతుందని దర్శకులు పేర్కొంటూ వస్తున్నారు. అలాగే, దర్శకులు చెప్పినట్టు నటిస్తూ, గ్లామర్ విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఎలాంటి కాల్ షీట్ సమస్యలు సృష్టించదన్న పేరు హన్సికకు ఉంది.

అదేవిధంగా పారితోషికం కూడా న్యాయ బద్ధంగా తీసుకుంటుందన్న మంచి పేరు ఉంది. అయితే, తాజాగా హన్సిక నిర్మాతలను తన ఇతర ఖర్చులతో హడలెత్తిస్తున్న ప్రచారం కోలీవుడ్‌లో బయలు దేరింది. ఈ బ్యూటీ చెన్నైకు వస్తే, తాను కోరుకున్న నక్షత్ర హోటల్‌లోనే బసచేస్తుందట. నిత్యం ఆ హోటల్ నుంచే అన్ని రకాల భోజనాలు తెప్పించుకుంటుందని ప్రచారం. సాధారణంగా హీరోయిన్లకు ఇద్దరు లేదా, ముగ్గురు సహాయకులు ఉంటారు. అలాంటిది హన్సికకు ఏకంగా పది మంది సహాయకులు ఉండడం, వారి ఖర్చు భారాన్ని అంతా నిర్మాతల నెత్తిన వేస్తున్నట్టు ప్రచారం.

అదే విధంగా షూటింగ్ సమయాల్లో కనీసం రెండు సార్లు అయినా, ఈ బామ ముంబైకు చెక్కేస్తూ, విమాన పయన ఖర్చును నిర్మాతల నెత్తినేస్తున్నదట. అదేవిధంగా ఇష్టం వచ్చినన్ని రోజులు నక్షత్ర హోటల్‌లో ఉంటూ, అన్ని రకాల ఖర్చులను నిర్మాతలకు అప్పగించే పనిలో పడిందని ప్రచారం సాగుతోంది. ఆమె పారితోషికం కంటే, ఈ ఖర్చులే అధికంగా ఉండడంతో  నిర్మాతలు గగ్గోలు పెడుతున్నట్టు కోలీవుడ్‌లో టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement