సినిమా డిస్ట్రిబ్యూషన్ పై నిర్మాతల్లో ఆందోళన! | Six Tamil film producers float distribution, marketing firm | Sakshi
Sakshi News home page

సినిమా డిస్ట్రిబ్యూషన్ పై నిర్మాతల్లో ఆందోళన!

Published Tue, Jul 8 2014 5:03 PM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

సినిమా డిస్ట్రిబ్యూషన్ పై నిర్మాతల్లో  ఆందోళన! - Sakshi

సినిమా డిస్ట్రిబ్యూషన్ పై నిర్మాతల్లో ఆందోళన!

సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని మార్కెట్ చేయడం మరో ఎత్తు. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సినిమాలు తీస్తున్నా.. వాటిని విజయవంతంగా పంపిణీ చేయడంపై తమిళ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై:సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని మార్కెట్ చేయడం మరో ఎత్తు. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సినిమాలు తీస్తున్నా.. వాటిని విజయవంతంగా పంపిణీ చేయడంపై తమిళ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ సమస్యను అధిగమించేందుకు తమిళనాడులో ప్రముఖ నిర్మాతాలైన కేఈ గ్నణవేల్ రాజా, ఎస్, శశికాంత్, సీవీ కుమార్, ఎల్రెడ్ కుమార్, అభినేష్ ఎలన్ గోవన్, లక్ష్మణ్ కుమార్ లు ఒక కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

 

'మేము ఎప్పట్నుంచో సినిమా డిస్ట్రిబ్యూషన్ పై పలు రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. అసలు తమిళనాడులో సినిమాను ఎలా మార్కెట్ చేయాలో తెలియడం లేదు. దీన్ని వ్యవస్థీకరించే మార్గం కనబడటం లేదు. ఇందుకు గాను ఒక కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం' అని వారు స్పష్టం చేశారు.  ఈ డ్రీమ్ ఫ్యాక్టరీతో నిర్మాతలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రూపుదిద్దుకున్నాక డిస్ట్రిబ్యూషన్-మార్కెటింగ్ కు మధ్య చోటుచేసుకునే సమస్యలకు తాము ఏర్పాటు చేసే కంపెనీ తగిన పరిష్కారం చూపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.  త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సరభమ్, మద్రాసు, యాన్, కావియా తలైయ్ వాన్, లుసియా చిత్రాలతో ఆ కంపెనీ సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్మాతలు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement