లావణ్యకు భారీ జరిమానా! | lavanya tripati fined Rs 3 crore | Sakshi
Sakshi News home page

లావణ్యకు రూ. 3 కోట్ల జరిమానా!

Published Mon, Oct 30 2017 4:33 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

lavanya tripati fined Rs 3 crore - Sakshi

సాక్షి, సినిమా: లావణ్య త్రిపాఠీ చిక్కుల్లో పడింది. ఆమెకి కోలీవుడ్‌ నిర్మాతల సంఘం మూడు కోట్ల రూపాయల జరిమానా విధించిందని తమిళ చిత్ర వర్గాలు అంటున్నాయి. తెలుగులో మంచి హిట్టయిన 100% లవ్‌ సినిమాను తమిళంలో 100% కాదల్‌ గా రీమేక్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు కథానాయకిగా లావణ్య త్రిపాఠీని ఎంచుకున్నారు. 

కానీ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే లావణ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.  దీంతో చిత్రీకరణను నిలిపివేశారు. అప్పటికే నిర్మాతలకు మూడు కోట్ల రుపాయల నష్టం వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలు.. సంఘాన్ని ఆశ్రయించడం జరిగిపోయింది. అయితే జరిమానా విషయంపై లావణ్య నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాజాగా ఈ చిత్ర కథానాయకిగా అర్జున్‌‌రెడ్డి ఫేం షాలిని పాండేను ఎంపిక చేశారు. కథానాయకుడిగా జి.వి. ప్రకాశ్‌ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement