
పాడి రైతుల ధర్నా
ఎస్‌ఎన్‌ఎఫ్ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని 8.5 కంటె తక్కువ వెన్న శాతం కలిగిన పాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహక ధనాన్ని...
కోలారు : ఎస్‌ఎన్‌ఎఫ్ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని 8.5 కంటె తక్కువ వెన్న శాతం కలిగిన పాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహక ధనాన్ని రూ.4 తక్కువ చేయడాన్ని ఖండిస్తూ తాలూకా పాల ఉత్పత్తి దారుల సహకార క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ప్రభుత్వ అతిథి గృహం వద్ద నుంచి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకుని బైఠాయించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ప్రోత్సాహక ధనాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాల ధరను కనీసం రెండు సంవత్సరాలకో సారి పెంచాలని కోరారు. పాల సంఘాలలో పనిచేసే సిబ్బందికి కనీస వేతనం నిర్ణయించాలని, ఆహార భద్రతా చట్టం కింద కార్యదర్శులపై తీసుకుంటున్న చర్యలను ఉపసంహరించుకోవాలని సూచిస్తూ జిల్లా కలెక్టర్ త్రిలోక్ చంద్రకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వి ఎం వెంకటేష్, కోచిముల్ డెరైక్టర్ ఆర్ రామకృష్ణేగౌడ, సంఘం కార్యదర్శి రామసంద్ర శివరుద్ర తదితరులు పాల్గొన్నారు.