GangSter Gangaraju Movie
-
ఓటీటీలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’కు హిట్ టాక్.. ఎక్కడంటే?
Gangster Gangaraju Movie Gets Hit Talk In Amazon Prime Video: కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా రుచించకపోవచ్చు కానీ ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధిస్తాయి. అలాంటి జాబితాలోకి తాజాగా చేరిన చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై లక్ష్ చదలవాడ హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. లక్ష్ పర్ఫార్మెన్స్ , సాయి కార్తీక్ సంగీతం, కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. చిత్రంలోని పాటలు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌తోపాటు సినిమాలోని పలు ట్విస్ట్‌లు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష స్పందనతో కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. చదవండి: నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ అప్పుడే రెండో బిడ్డా? కాస్త ఆగలేకపోయావా? నటి ఏమందంటే? ఈ చిత్రంలో లక్ష్, వేదిక దత్, వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ నన్నిమాల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ మూవీ రివ్యూ
టైటిల్ : గ్యాంగ్‌స్టర్ గంగరాజు నటీనటులు : లక్ష్య్, వేదిక దత్త, వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్ తదితరులు నిర్మాణ సంస్థ:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ దర్శకత్వం: ఇషాన్ సూర్య సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: కణ్ణ పి.సి. ఎడిటర్ : అనుగోజు రేణుకా బాబు విడుదల తేది : జూన్ 24,2022 రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో లక్ష్. 'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ శుక్రవారం(జూన్ 24) విడుదలైన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దేవరలంకకు చెందిన గంగరాజు(లక్ష్య్) ఓ గ్యాంగ్‌ని వేసుకొని ఆవారాగా తిరుగుతుంటాడు. తండ్రి నాగరాజు( గోపరాజు రమణ) రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ కావడానికి సిద్దంగా ఉంటాడు. కొడుకు మాత్రం జులాయిగా తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. గంగరాజు ఉండే ఏరియాలోకే కొత్తగా వస్తుంది ఎస్సై ఉమాదేవి( వేదిక దత్త). ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె ప్రేమని పొందడం కోసం నానా తిప్పలు పడుతుంటాడు. ఇలా సాధారణ జీవితాన్ని గడుపుతున్న గంగరాజు...అనుకొని సంఘటన వల్ల దేవరలంకలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సిద్దప్పని హత్య చేస్తాడు. ఆ తర్వాత గంగరాజు జీవితమే మారిపోతుంది. ఊరంతా అతన్ని గ్యాంగ్‌స్టర్ గంగరాజు అని పిలవడం స్టార్ట్ చేస్తుంది. అసలు సిద్దప్పని గంగరాజు ఎందుకు హత్య చేశాడు? దేవరలంకకు చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి(శ్రీకాంత్ అయ్యంగార్) బామ్మర్ది బసిరెడ్డి(చరణ్ దీప్)తో గంగరాజుకు ఉన్న వివాదం ఏంటి? దేవరలంక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న రౌడీ బసిరెడ్డిని గంగరాజు ఎలా మట్టుబెట్టాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’.. ఈ టైటిల్ వినగానే బండ్లు గాల్లోకి ఎగరడాలు, బాంబులు, చేజింగ్ లు, ఫైటింగ్ ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ స్టోరీ అంతా ఒక ఫిక్షనల్ టౌన్లో జరుగుతుంది. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. కథంతా కామెడీగా సాగుతూనే అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు ఇషాన్ సూర్య. ఫస్టాఫ్ అంతా ఉమాదేవి, గంగరాజుల ప్రేమ చుట్టే సాగుతుంది. ఉమాదేవి ప్రేమను పొందేందుకు గంగరాజు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. అలాగే బామ్మగా అన్నపూర్ణమ్మ చేసే ఫైట్ సీన్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో గ్యాంగ్‌స్టర్ గంగరాజు అసలు రూపం బయటపడుతుంది. బసిరెడ్డి నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే నర్సారెడ్డిని బకరా చేసిన తీరు అందరిఊఈ నవ్విస్తుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో లక్ష్య్. సినిమా సినిమాకి తన పాత్రలో వేరియష్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను మెప్పించిన లక్ష్య్ ఈ సారి తనదైన పంథాలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే డిఫరెంట్ మూవీతో వచ్చాడు. గంగరాజుగా లక్ష్య్ అదరగొట్టేశాడు. కామెడీ, ఫైట్స్, ఎమోషనల్.. ఇలా ప్రతి సీన్స్‌లో అద్భుతమైన నటనను కనబరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు. ఎస్సై ఉమాదేవిగా వేదికదత్త తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. గంగరాజు తండ్రి నాగరాజు పాత్రలో గోపరాజు రమణ ఒదిగిపోయాడు. ఒక ఎమ్మెల్యే నర్సారెడ్డిగా శ్రీకాంత్ అయ్యంగార్ తనదైన కామెడీతో నవ్వించాడు. బసిరెడ్డిగా చరణ్ దీప్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ నన్నిమాల తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. కణ్ణ పి.సి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ చాలా బ్యూటిఫుల్‌గా తీశాడు. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఒకేరోజు 8 సినిమాలు రిలీజ్, అవి మాకసలు పోటీనే కాదు: హీరో
'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న లక్ష్ తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర హీరో లక్ష్ చదవలవాడ మాట్లాడుతూ.. ♦ నాలుగు సంవత్సరాల క్రితం నేను ప్రొడ్యూసర్‌గా పని చేశాను. ఆ సమయంలో శీను వైట్ల, మురుగదాస్‌ల దగ్గర చాలా సినిమాలకు వర్క్ చేసిన ఇషాన్ సూర్య ఒక మంచి కథతో వచ్చి ఒక సినిమా చేద్దాం అన్నాడు. అయితే అప్పుడు నేను నిర్మాతగా ఉన్నందున తరువాత చూద్దామన్నాను. ♦ బిచ్చగాడు రిలీజ్ అయిన తరువాత వచ్చిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, క్షణం సినిమాలను చూస్తుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం మొదలు పెట్టారనిపించింది. ఆ సినిమాల తర్వాత వాళ్ళు స్టార్ హీరోలయిపోయారు. అప్పుడు మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తే ప్రేక్షకులు అదరిస్తారనే నమ్మకంతో ఇండస్ట్రీలో నిర్మాతగానే కాకుండా నటుడుగా నాకంటూ ఒక ఐడెంటిటీని క్రెయేట్ చేసుకోవాలని వర్క్ అవుట్స్ చేసి 25 కేజీలు తగ్గాను. మంచి కంటెంట్ ఉన్న "వలయం" సినిమాతో ఇండస్ట్రీకి రాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ♦ "వలయం" తర్వాత రెండు సినిమాలు చేద్దామనుకున్న టైంలో కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం కథ చెప్పిన సూర్య గుర్తుకు రావడంతో తనను పిలిచి నేనే "గ్యాంగ్‌స్టర్ గంగరాజు" కాన్సెప్ట్ చెప్పాను. తను ఈ కథను డెవలప్ చేశాడు. ♦ ఒక హీరో అనే వాడు తన కంటే పవర్ ఫుల్ ఉన్నవాళ్ళతో ఢీకొంటే బాగుంటుందని మైండ్ లో పెట్టుకొని ఒక రాజమౌళి గారి సినిమాలో విలన్, ఒక శ్రీను వైట్ల గారి సినిమాలో హీరో ఇద్దరు కలసి స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో ఈ "గ్యాంగ్ స్టర్ గంగరాజు" అలా ఉంటుంది. నా సినిమాల్లో చేసే నలుగురు విలన్స్ అందరు కూడా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు. నాకంటే హైట్‌లో ఉంటారు. ♦ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీమ్ ఇలా చాలా సినిమాలకు మ్యూజిక్ చేసి చాలా మంచి మ్యూజికల్ సక్సెసర్ అనిపించు కున్నాడు. మీరు విన్న ఈ సాంగ్స్ కంటే కూడా ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. సినిమాలో లాస్ట్ 20 మినిట్స్‌కు మాత్రం కచ్చితంగా విజిల్స్ వేసేలా సినిమా ఉంటుంది. ♦ ఈ సినిమాకు మా నాన్న పేరు వేద్దామని నేను చాలాసార్లు మా నాన్నను అడిగినా తను ఒప్పుకోలేదు ఎందుకంటే.. మా నాన్నగారికి ఆయన పేరు బయట వేసుకోవడానికి ఇష్టపడరు. ఇంతకాలం నేను నిర్మాతగా చేశాను. ఒక నిర్మాత కష్టాలు ఏంటో తెలుసుకుని నువ్వు ఇక సక్సెస్ ఫుల్ నిర్మాతవు అవ్వాలి అంటాడు. నా సినిమా ఈవెంట్ కి వచ్చినా తను ఒక గెస్ట్ గా వస్తాడు ♦ ఈ సినిమా తర్వాత చేస్తున్న "ధీర" గ్యాంగ్ స్టర్ గంగరాజు కన్నా వెరీ డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంటుంది. ♦ ఈనెల 24న చాలా సినిమాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకోమని చాలా మంది చెప్పారు .అయితే మా సినిమాను 24 కు రిలీజ్ చేద్దాం అని అనౌన్స్ చేసినప్పుడు మాకు పోటీగా కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమే.. మాత్రమే ఉంది. ఆ తరువాత ఎనిమిది సినిమాలు ఒకటే డేట్‌కు వస్తున్నాయి. ఇదంతా మన చేతుల్లో లేదు. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. ఇక నుంచి ఏ వారం చూసినా ప్రతి వారం కూడా ఆరు, ఏడు సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. అందుకని మేము ఈ నెల 24నే వస్తున్నాము. ♦ ఇప్పుడు వస్తున్న పది సినిమాల్లో కూడా మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది మా సినిమా ఒక్కటే అనుకుంటున్నాను. ఇక మిగిలిన సినిమాలు ఉన్నా అవి డిఫరెంట్ జోనర్స్ కాబట్టి మాకు కాంపిటీషన్ లేదు అను కుంటున్నాను. నేను ఒక యాక్టర్ నే కాకుండా నాకు ప్రొడ్యూసర్స్ కష్టాలు కూడా తెలుసు కాబట్టి మా సినిమాతో పాటు రేపు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. మా సినిమాను తెలుగులో మూడు వందల థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము. తమిళ్ లో 100 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి సీక్వెల్ ఉంటుంది అని ముగించారు. చదవండి: ఆ హీరోయిన్స్ వద్దు.. జక్కన్నకి మహేశ్ బాబు మెలిక పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు! -
నా దృష్టిలో నిర్మాతలే హీరోలు
‘‘నా దృష్టిలో నిర్మాతలే హీరోలు. అందుకే నా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నిర్మాతలను ఆహ్వానించాను. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాస్. లక్ష్ చదలవాడ, వేదిక దత్త జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదలవుతోంది. ‘‘ఒక పెద్ద సినిమా తీసే బడ్జెట్లో 25 చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే కొత్త వారితో మా బ్యానర్లో 15 సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాస్. -
Vedieka Dutt Latest Photos: అందానికి వేదిక..వేదిక దత్ (ఫొటోలు)
-
‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు' వచ్చేస్తున్నాడు
'వలయం' ఫేమ్ లక్ష్య్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కింది. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేస్తున్నారు. -
రక్తం మరిగిన పులి 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'.. ఆసక్తిగా ట్రైలర్
Laksh Starrer Gangster Gangaraju Trailer Released: వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో లక్ష్. 'వలయం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్.. ఇప్పుడు 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కమర్షియల్ ఎలెమెంట్స్తో కూడిన ఈ 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని చెప్పుకోవాలి. “వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాలో లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ చూపించారు. ఈ వీడియోలో సినిమాలోని యాక్షన్, రొమాంటిక్, ఫన్నీ ఎలిమెంట్స్ అన్నీ చూపించడంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. -
డిసెంబర్లో 'గ్యాంగ్ స్టర్ గంగ రాజు'
'వలయం' ఫేమ్ లక్ష్ చదలవాడ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం `గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్' పతాకం పై 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో మంచి అభిరుచి గల నిర్మాత పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతోన్న 'గ్యాంగ్ స్టర్ గంగ రాజు' చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ... అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇటీవల విడుదలైన `గ్యాంగ్‌స్టర్ గంగరాజు`ఫుల్ టైటిల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతుండడం మరో విశేషం. ఇక ఇటీవల జరిగిన షెడ్యూల్ తో 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి డిసెంబర్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. -
డిఫరెంట్ కాన్సెప్ట్ తో `గ్యాంగ్‌స్టర్ గంగరాజు`
పలు సినిమాలతో నటుడిగా తనని తాను రుజువు చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం తో ఆకట్టుకున్న ఆయన హీరో గా నటిస్తున్న తాజా చిత్రం `గ్యాంగ్‌స్టర్ గంగరాజు`. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట కూడా విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. సినిమా పై కూడా అంచనాలు పెంచాయి. కాగా ఈరోజు(అక్టోబర్ 9) హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఈ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమా లోని పాత్ర కోసం అయన తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం అందిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మంచి అభిరుచి గల నిర్మాత పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ మాత్రమే మిగిలిఉంది ఉంది. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా ను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని నిర్మాత తెలిపారు.