రక్తం మరిగిన పులి 'గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు'.. ఆసక్తిగా ట్రైలర్‌ | Laksh Starrer Gangster Gangaraju Trailer Released | Sakshi
Sakshi News home page

Gangster Gangaraju Movie: రక్తం మరిగిన పులి 'గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు'.. ఆసక్తిగా ట్రైలర్‌

Published Mon, Jun 13 2022 9:00 PM | Last Updated on Mon, Jun 13 2022 9:02 PM

Laksh Starrer Gangster Gangaraju Trailer Released - Sakshi

Laksh Starrer Gangster Gangaraju Trailer Released: వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో లక్ష్. 'వలయం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్.. ఇప్పుడు 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

కమర్షియల్ ఎలెమెంట్స్‌తో కూడిన ఈ 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని చెప్పుకోవాలి. “వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాలో లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ చూపించారు. ఈ వీడియోలో సినిమాలోని యాక్షన్, రొమాంటిక్, ఫన్నీ ఎలిమెంట్స్ అన్నీ చూపించడంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను జూన్‌ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement