Gangster Gangaraju Hero Laksh Chadalavada Full Interview - Sakshi
Sakshi News home page

Laksh Chadalavada: గ్యాంగ్‌స్టర్‌ గంగరాజుకు సీక్వెల్‌ కూడా ఉండొచ్చు: హీరో

Published Thu, Jun 23 2022 8:46 PM | Last Updated on Fri, Jun 24 2022 10:06 AM

Gangster Gangaraju Hero Laksh Chadalavada Interview - Sakshi

'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న లక్ష్ తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల  24న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర హీరో లక్ష్ చదవలవాడ  మాట్లాడుతూ..

♦ నాలుగు సంవత్సరాల క్రితం నేను ప్రొడ్యూసర్‌గా పని చేశాను. ఆ సమయంలో శీను వైట్ల, మురుగదాస్‌ల దగ్గర చాలా సినిమాలకు వర్క్ చేసిన ఇషాన్ సూర్య ఒక మంచి కథతో వచ్చి ఒక సినిమా చేద్దాం అన్నాడు. అయితే అప్పుడు నేను నిర్మాతగా ఉన్నందున తరువాత  చూద్దామన్నాను.

♦ బిచ్చగాడు రిలీజ్ అయిన తరువాత వచ్చిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, క్షణం సినిమాలను చూస్తుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం మొదలు పెట్టారనిపించింది. ఆ సినిమాల తర్వాత వాళ్ళు స్టార్ హీరోలయిపోయారు. అప్పుడు మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తే ప్రేక్షకులు అదరిస్తారనే నమ్మకంతో ఇండస్ట్రీలో నిర్మాతగానే కాకుండా నటుడుగా నాకంటూ ఒక ఐడెంటిటీని క్రెయేట్ చేసుకోవాలని వర్క్ అవుట్స్ చేసి 25 కేజీలు తగ్గాను. మంచి కంటెంట్ ఉన్న "వలయం" సినిమాతో ఇండస్ట్రీకి రాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

♦ "వలయం" తర్వాత రెండు సినిమాలు చేద్దామనుకున్న టైంలో కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం కథ చెప్పిన సూర్య గుర్తుకు రావడంతో తనను పిలిచి నేనే "గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు" కాన్సెప్ట్ చెప్పాను. తను ఈ కథను డెవలప్ చేశాడు.

♦  ఒక హీరో అనే వాడు తన కంటే పవర్ ఫుల్ ఉన్నవాళ్ళతో ఢీకొంటే  బాగుంటుందని మైండ్ లో పెట్టుకొని ఒక రాజమౌళి గారి సినిమాలో విలన్, ఒక శ్రీను వైట్ల గారి సినిమాలో హీరో ఇద్దరు కలసి స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో ఈ "గ్యాంగ్ స్టర్ గంగరాజు" అలా ఉంటుంది. నా సినిమాల్లో చేసే నలుగురు విలన్స్ అందరు కూడా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తారు. నాకంటే హైట్‌లో ఉంటారు. 

♦ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను  పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీమ్ ఇలా చాలా సినిమాలకు మ్యూజిక్ చేసి చాలా మంచి మ్యూజికల్ సక్సెసర్ అనిపించు కున్నాడు. మీరు విన్న ఈ సాంగ్స్ కంటే కూడా ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అద్భుతంగా ఉంటుంది. సినిమాలో లాస్ట్ 20 మినిట్స్‌కు మాత్రం కచ్చితంగా విజిల్స్ వేసేలా సినిమా ఉంటుంది.

♦ ఈ సినిమాకు మా నాన్న పేరు వేద్దామని నేను చాలాసార్లు మా నాన్నను అడిగినా తను ఒప్పుకోలేదు ఎందుకంటే.. మా నాన్నగారికి ఆయన పేరు బయట వేసుకోవడానికి ఇష్టపడరు. ఇంతకాలం నేను నిర్మాతగా చేశాను. ఒక నిర్మాత కష్టాలు ఏంటో తెలుసుకుని నువ్వు ఇక సక్సెస్ ఫుల్ నిర్మాతవు అవ్వాలి అంటాడు. నా సినిమా ఈవెంట్ కి వచ్చినా తను ఒక  గెస్ట్ గా వస్తాడు 

♦ ఈ సినిమా తర్వాత చేస్తున్న "ధీర"  గ్యాంగ్ స్టర్ గంగరాజు కన్నా వెరీ డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంటుంది.

♦ ఈనెల 24న చాలా సినిమాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకోమని చాలా మంది చెప్పారు .అయితే మా సినిమాను 24 కు రిలీజ్ చేద్దాం అని అనౌన్స్ చేసినప్పుడు మాకు పోటీగా కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమే.. మాత్రమే ఉంది. ఆ తరువాత ఎనిమిది సినిమాలు ఒకటే డేట్‌కు వస్తున్నాయి. ఇదంతా మన చేతుల్లో లేదు. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. ఇక నుంచి ఏ వారం చూసినా ప్రతి వారం కూడా ఆరు, ఏడు సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. అందుకని మేము ఈ నెల 24నే వస్తున్నాము.

♦ ఇప్పుడు వస్తున్న పది సినిమాల్లో కూడా మాస్ ఎలిమెంట్స్ తో  ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది మా సినిమా ఒక్కటే అనుకుంటున్నాను. ఇక మిగిలిన సినిమాలు ఉన్నా అవి డిఫరెంట్ జోనర్స్ కాబట్టి మాకు కాంపిటీషన్ లేదు అను కుంటున్నాను. నేను ఒక యాక్టర్ నే కాకుండా నాకు ప్రొడ్యూసర్స్ కష్టాలు కూడా తెలుసు కాబట్టి మా సినిమాతో పాటు రేపు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. మా సినిమాను తెలుగులో మూడు వందల థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము. తమిళ్ లో 100 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి  సీక్వెల్ ఉంటుంది అని ముగించారు.

చదవండి: ఆ హీరోయిన్స్‌ వద్దు.. జక్కన్నకి మహేశ్‌ బాబు మెలిక
పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్‌ విడాకులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement