యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'ధీర'.. ఫస్ట్ లుక్ రిలీజ్  | Dheera First Look Releases Laksh Chadalawada Birthday Gift | Sakshi
Sakshi News home page

Dheera First Look: హీరో బర్త్‌డే కానుకగా 'ధీర' ఫస్ట్ లుక్ రిలీజ్..

Published Sun, Oct 9 2022 6:03 PM | Last Updated on Sun, Oct 9 2022 6:04 PM

Dheera First Look Releases  Laksh Chadalawada Birthday Gift - Sakshi

లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ధీర'. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తున్నారు.  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ ‍లుక్ రిలీజ్ చేశారు.  హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా విడుదల చేసింది చిత్రబృందం. ఓ సరికొత్త కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ 'ధీర' సినిమాను రూపొందిస్తున్నారు.

వలయం సినిమాతో సక్సెస్ అందుకున్న లక్ష్.. 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. పోస్టర్‌ను చూస్తే పూర్తి యాక్షన్ హీరోని తలపించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని, 2023లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement