ఆసక్తికరంగా 'ధీర' ట్రైలర్.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ | Laksh Dheera Movie Telugu Trailer And Release Date | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా 'ధీర' ట్రైలర్.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Published Sat, Jan 27 2024 7:53 PM | Last Updated on Sat, Jan 27 2024 7:53 PM

Laksh Dheera Movie Telugu Trailer And Release Date - Sakshi

'వలయం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో లక్ష్ చదలవాడ. ఇప్పుడు యాక్షన్ ఎంటర్‌టైనర్ స్టోరీతో తీసిన 'ధీర' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌‌పై పద్మావతి చదలవాడ నిర్మించారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. అలానే చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?)

ఈ ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, లవ్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు బాగున్నాయి. 'నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అయితే ఇదే తేదీన తెలుగులోనే పలు స్ట్రెయిట్ మూవీస్ కూడా రానున్నాయి. 

(ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement