Gangster Gangaraju Movie Gets Hit Talk In Amazon Prime Video, Deets Inside - Sakshi
Sakshi News home page

Gangster Gangaraju Movie: ఓటీటీలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ హిట్టు..

Published Fri, Aug 19 2022 7:32 PM | Last Updated on Sat, Aug 20 2022 11:23 AM

Gangster Gangaraju Movie Gets Hit Talk In Amazon Prime Video - Sakshi

Gangster Gangaraju Movie Gets Hit Talk In Amazon Prime Video: కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా రుచించకపోవచ్చు కానీ ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధిస్తాయి. అలాంటి జాబితాలోకి తాజాగా చేరిన చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై లక్ష్ చదలవాడ హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా థియేటర్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. 

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో 'గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు' సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. లక్ష్ పర్ఫార్మెన్స్ , సాయి కార్తీక్ సంగీతం, కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. చిత్రంలోని పాటలు, ఇంటర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్‌తోపాటు సినిమాలోని పలు ట్విస్ట్‌లు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలో మంచి విజయం సాధించింది.  ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష స్పందనతో కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. 

చదవండి: నేనేం స్టార్‌ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్‌ రాజ్‌పుత్‌
అప్పుడే రెండో బిడ్డా? కాస్త ఆగలేకపోయావా? నటి ఏమందంటే?

ఈ చిత్రంలో లక్ష్, వేదిక ద‌త్, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement