![GangSter Gangaraju Team Birthday Wishes To Laksh Chadalavada - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/9/gang-ster-gangaraj.jpg.webp?itok=8YRngWlI)
పలు సినిమాలతో నటుడిగా తనని తాను రుజువు చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం తో ఆకట్టుకున్న ఆయన హీరో గా నటిస్తున్న తాజా చిత్రం `గ్యాంగ్‌స్టర్ గంగరాజు`. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట కూడా విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. సినిమా పై కూడా అంచనాలు పెంచాయి. కాగా ఈరోజు(అక్టోబర్ 9) హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఈ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సినిమా లోని పాత్ర కోసం అయన తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం అందిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మంచి అభిరుచి గల నిర్మాత పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ మాత్రమే మిగిలిఉంది ఉంది. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా ను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment