దాగుడు మూతలాట ఆడుకోని వాళ్లుండరు... కళ్లకు గంతలు కట్టి పేర్లు అడిగితే చెప్పాలి. ఇది రియల్ ఆట. రీల్ గేమ్ విషయానికి వస్తే.. గంతలు కట్టకుండా.. ఆర్టిస్ట్‌ని ఎదురుగా నిలబెట్టి, ‘వీరి పేరేమి’ అని అడిగితే.. ఆ ఆర్టిస్ట్‌నిగుర్తుపట్టడానికి కాస్త టైమ్ పడుతుంది. అసలు గుర్తు పట్టకపోవచ్చు కూడా. అంతలా కొందరు స్టార్స్ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. ఫిజికల్ మేకోవర్‌తో, మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆ హీరోల గురించి తెలుసుకుందాం.
♦ పాత్రల కోసం రూపా న్ని మార్చుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు విక్రమ్. ‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. తాజాగా ‘తంగలాన్’లో కొత్త అవతారంలో కనిపించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు విక్రమ్. గనుల తవ్వకాల పనులు చేసే వ్యక్తుల జీవితాల నేపథ్యంలో దర్శకుడు పా . రంజిత్ పా న్ ఇండియా మూవీగా ‘తంగలాన్’ని తెరకెక్కిస్తున్నారు.
♦ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవాలనుకుంటారు అల్లు అర్జున్. గతంలో ‘దేశ ముదురు’ సినిమా కోసం సిక్స్ ΄్యాక్ చేశారు. తాజాగా ‘పుష్ప’ కోసం ఫిజికల్ మేకోవర్‌తో పా టు మేకప్ పరంగానూ వ్యత్యాసం చూపించారు. స్మగ్లర్ పుష్పరాజ్‌గా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో రెచ్చి పోయారు అల్లు అర్జున్. మలి భాగం ‘పుష్ప:ది రూల్’ చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. పుష్పరాజ్‌గా గుర్తు పట్టలేనంతగా అల్లు అర్జున్ మారలేదు. కానీ రెండో భాగంలో జాతర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఒక ఫైట్‌లో గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. పండగ చివరి రోజు స్త్రీ వేషధారణలో పురుషులు చెడును నాశనం చేసే గంగమ్మ తల్లిగా మారతారని, ఈ ఫైట్‌లో అల్లు అర్జున్ గెటప్ అదే అని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
♦ దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పా త్రల్లో సుధీర్‌బాబు కనిపించనున్న చిత్రం ‘మామా మశ్చింద్ర’.. వీటిలో దుర్గ పా త్ర డిఫరెంట్. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. మామూలుగా సు«దీర్‌బాబు చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటారు. అయితే ఈ పా త్రలో అందుకు భిన్నంగా బొద్దుగా కనబడతారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది,
♦ అటు మలయాళంకి వెళితే సీనియర్ హీరో మోహన్‌లాల్, యంగ్ హీరో పృథ్వీ రాజ్‌కుమారన్‌లు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. మోహన్‌లాల్ టైటిల్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ బర్రోజ్. ఆ నిధిని వాస్కో అసలు వారసునికి అప్పగించడానికి ఆ ఆత్మ వేచి ఉంటుంది. కాల్పనిక కథతో త్రీడీ చిత్రంగా ‘బర్రోజ్’ రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడంతో పా టు మోహన్ లాల్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు.
♦ మరో మలయాళ హీరో–దర్శకుడు పృథ్వీ రాజ్‌కుమారన్ గొర్రెల కాపరిగా కనిపించనున్న చిత్రం ‘ఆడు జీవితం’. 2008లో ఇదే పేరుతో వచ్చిన నవల నేపథ్యంలో బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నజీబ్ అనే మలయాళీ వలస కార్మికుడి పా త్రలో పృథ్వి రాజ్ కనిపిస్తారు. సౌదీ అరేబియాకి వలస వెళ్లిన నజీబ్‌ను గొర్రెల కాపరిని చేసి, బలవంతంగా బానిసత్వంలోకి నెట్టివేస్తారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. సవాళ్లను ఇష్టపడని స్టార్స్ ఉండరు. అయితే సవాళ్లు అరుదుగా వస్తుంటాయి. అందుకే చాలెంజింగ్ రోల్స్ వచ్చి నప్పుడు ‘సై’ అంటూ ఎంత కష్టపడటానికైనా సిద్ధపడిపోతారు. ఈ సవాళ్లు స్టార్స్‌కి కిక్కే.. అభిమానులకూ కిక్కే. సినిమా సరిగ్గా క్లిక్ అయితే బాక్సాఫీస్‌కీ కిక్కే.
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?
Published Wed, Apr 26 2023 2:34 AM | Last Updated on Wed, Apr 26 2023 2:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment