బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హీరోల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి లాభాలు తెచ్చే సత్తా ఉండదు కానీ కోట్లకు కోట్లు పారితోషికం అడుగుతారని ఎద్దేవా చేశారు. అలాగే కొన్ని సినిమాల వల్ల తాను పెద్ద మొత్తంలో నష్టపోయానని వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. 'ఇద్దరు వ్యక్తులతో ఒక స్టార్టప్‌లాగా ధర్మ ప్రొడక్షన్స్ ప్రారంభించాను. యశ్ చోప్రా చెప్పినట్లు సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాదు, దానికోసం మనం పెట్టే బడ్జెటే దాన్ని నిర్ణయిస్తుంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ విషయంలో అదే రుజువైంది. ఆ సినిమాతో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రాలను లాంచ్ చేశాను. ఆ సినిమా పేరుకు హిట్టయింది కానీ నాకు డబ్బులు రావడం కాదు కదా పెట్టినవి కూడా పోయాయి.
సినిమా అంటే నాకు ఒక ఎమోషన్. హిందీ సినిమా కోసం నా మనసు ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. కానీ ఒక బిజినెస్‌మెన్‌గా మాట్లాడాల్సి వస్తే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే సినిమాలో ఎక్కువ మొత్తం పారితోషికం రూపంలో స్టార్స్‌కే వెళ్లిపోతుంది. ఇలా అంటున్నందుకు నన్ను హత్య చేస్తారేమో, కానీ ఇదే నిజం. సినిమా ఫస్ట్ డేకు రూ.5 కోట్లు కూడా రాబట్టలేరు కానీ రూ.20 కోట్లు అడుగుతారు. ఇదసలు న్యాయమేనా?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు కరణ్. ఇది చూసిన నెటిజన్లు 'కరణ్ కరెక్ట్‌గా చెప్పాడు', 'తెలుగు సినిమాల విషయంలో కరణ్ నిజాయితీగా మాట్లాడతాడు' అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ అద్దెకు, ఎన్ని లక్షలంటే?
దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వీజే సన్నీ
Comments
Please login to add a commentAdd a comment