'మరికొద్దిరోజుల్లో జరుపుకోనున్న క్రిస్మస్‌కు దాదాపు ప్రపంచమంతా ఆతృతగా రెడీ అయి΄ోతోంది. షాపింగ్ మాల్స్ నుంచి క్రిస్టియన్ లోగిళ్లు, చర్చ్‌లు.. క్రిస్మస్ స్టార్‌లు, ట్రీల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. వీటితో΄ాటు తప్పనిసరిగా సందడి చేసేవి శాంతాక్లాజ్ ఇచ్చే బహుమతులు. శాంతాక్లాజ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ కోసం పిల్లలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పిల్లలేగాక, కొన్ని కంపెనీలు సైతం ఉద్యోగులకు, కొంతమంది బంధువులకు, స్నేహితులకు, సహోద్యోగులకు సర్‌ప్రైజ్‌గిప్ట్స్‌ను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి క్రిస్మస్‌కు తక్కువ బడ్జెట్‌లో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా నిలిచే బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..'
మొక్కలు
పర్యావరణం పచ్చగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే పర్యావరణ స్నేహితం అయిన పచ్చని మొక్కలను క్రిస్మస్‌కు బహుమతిగా ఇవ్వొచ్చు. ఇప్పుడున్న ఇరుకు ఇళ్లకు ఇండోర్ ΄్లాంట్స్ అయితే మరింత మంచి గిఫ్ట్ అవుతాయి.
గిఫ్ట్‌కార్డ్స్, స్పా వోచర్స్
మార్కెట్లో రకరకాల ఫ్యాషన్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏవైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. స్పా వోచర్స్ కూడా మంచి గిఫ్ట్సే.
మ్యాచింగ్ పీజేఎస్
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నప్పేలా మ్యాచింగ్ క్రిస్మస్ పైజమాలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి ప్రత్యేకంగానూ, ఫన్నీగా ఉండి పండుగ సందడిని మరింత పెంచుతాయి.
బుక్స్..
మార్కెట్లో ΄ాపులర్‌గానూ, బాగా సేల్ అవుతున్న నవలలు, క్లాసిక్ సాహిత్యం, ప్రేరణ కలిగించే పుస్తకాలు, ఆర్ట్, ఫొటోగ్రఫీ, ట్రావెల్‌కు సంబంధించిన కాఫీ టేబుల్ బుక్స్‌కూడా మంచి బహుమతులు. ఈ గిఫ్ట్ ఎక్కువకాలం నిలిచి ఉంటుంది.
పర్సనలైజ్డ్ గిఫ్ట్స్
ఇమిటేషన్ జ్యూవెలరీ, ట్రెండీ అండ్ స్టైలిష్ ఫ్యాషన్ యాక్సరీస్ (వాచ్‌లు, సన్‌గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్), ఫొటో ఆల్బమ్స్, ఫ్రేమ్స్ కూడా క్రిస్మస్ గిఫ్ట్‌గా పనికొస్తాయి. ఇవి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి.
సెల్ఫ్‌కేర్
చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎక్కువమంది వింటర్‌లో చర్మాన్ని కోమలంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కాబట్టి వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తుల సెట్స్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవేగాక..సెంటెడ్ క్యాండిల్స్, ఫేస్‌మాస్క్‌లు, స్లీపింగ్ మాస్కులు, బాతింగ్ కిట్స్ మంచి గిఫ్ట్స్.
పెర్‌ఫ్యూమ్స్..
పెర్‌ఫ్యూమ్స్ క్లాసిక్‌గానూ, అందుబాటు ధరలో దొరికే గిఫ్ట్ ఐటమ్స్. పెర్‌ఫ్యూమ్ వాడిన ప్రతిసారి .. ఆ సువాసన భరిత పరిమళాలు మీ గిఫ్ట్‌తో΄ాటు మిమ్మల్ని, మీ అభిమానాన్ని గుర్తుచేస్తాయి.
మ్యూజిక్ బాక్స్
చార్మింగ్ లిటిల్ మ్యూజిక్ బాక్స్ కూడా ప్రత్యేకంగానూ ఫన్నీగా ఉంటుంది. ఇది కూడా క్రిస్మస్‌కు మంచి గిఫ్ట్. దీనినుంచి వచ్చే సంగీతం మనసుని ఆహ్లాద పరుస్తుంది.
అందమైన మగ్స్
ఉద్యోగులకు లేదా కొలీగ్స్‌కు అందంగా ఉండే మగ్స్ మంచి గిఫ్ట్ ఐడియా. ఈ మగ్స్‌లో స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడం లేదా, ఇష్టమైన కాఫీ తాగడం లేదా తరచూ వాడే ఐటమ్స్, అందమైన వస్తువులను పెట్టుకుంటారు. ఇవి తక్కువ ధరలో మంచి మంచి డిజైన్స్‌లో కూడా దొరుకుతాయి.
ఎయిర్ ప్యూరిఫైర్..
ఎంతవేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతేస్పీడుగా గాలి కలుషితమై΄ోతున్న ఈ రోజుల్లో.. ఎయిర్ ప్యూరిఫయర్స్, ఫిల్టర్స్ అవసరంగా మారి΄ోతున్నాయి. అందుకే మినీ ప్యూరిఫయర్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. వీటిద్వారా మీ సన్నిహితులకు మంచి ఆక్సిజెన్‌ను అందించిన వారవుతారు.
డెకరేషన్ ఐటమ్స్
అలంకరించేకొద్దీ ఇంటి అందం పెరగడంతో΄ాటు.. కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాఫీ, టీసెట్స్, కుకింగ్ గాడ్జెట్స్, కిచెన్ టూల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఆర్ట్ వర్క్ హోం డెకరేటివ్ ఐటమ్స్ కూడా మంచి గిఫ్ట్స్. చిన్న పరిమాణం నుంచి పెద్దసైజులో ఎంతో ఆకర్షణీయమైన, ఉపయోగకరమైనవి అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి.
క్రాఫ్ట్స్ మేకింగ్ కిట్స్
జ్యూవెలరీ తయారీ, క్యాండిల్ తయారీ, సబ్బుల తయారీ కిట్స్, వెరైటీ దియా మేకింగ్ కిట్స్, ΄్లాంట్ టెర్రారియం, గార్డెనింగ్ సెట్స్ కూడా మంచి బహుమతులే.
వీటిలో ఏది బహుమతిగా ఇచ్చినా మీరు మీ ఆత్మీయుల సంతోషాన్ని చూరగొంటారు.
ఇవి కూడా చదవండి: ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం!
Comments
Please login to add a commentAdd a comment